News May 3, 2024

ఎండల ఉగ్రరూపం.. వడదెబ్బతో నలుగురు మృతి

image

TG: రాష్ట్రంలో ఎండలు ఉగ్రరూపం దాల్చాయి. నిన్న ఏకంగా 8 జిల్లాల్లో 46 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రత నమోదైంది. నల్గొండ జిల్లా ఇబ్రహీంపేటలో అత్యధికంగా 46.6 డిగ్రీల టెంపరేచర్ రికార్డైంది. ఎండ వేడికి తాళలేక నిన్న ఒక్కరోజే నలుగురు మృత్యువాత పడ్డారు. మెదక్ జిల్లాలో కుమ్మరి శాకయ్య, ఆసిఫాబాద్‌లో పోర్తెటి శ్రీనివాస్, కరీంనగర్‌లో గజ్జెల సంజీవ్, హనుమకొండలో అల్లె గోవర్ధన్ వడదెబ్బకు గురై ప్రాణాలు విడిచారు.

Similar News

News November 12, 2024

ట్రంప్ పాలకవర్గంలో రామస్వామికి కీలక బాధ్యతలు?

image

ట్రంప్ US అధ్యక్షుడిగా జనవరిలో బాధ్యతలు చేపట్టనున్నారు. కాగా ఆయన పాలకవర్గంలో ఇండో-అమెరికన్ వివేక్ రామస్వామి కీలక బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఆయనకు హోంల్యాండ్ సెక్యూరిటీ&ఇమ్మిగ్రేషన్ పాలసీని పర్యవేక్షించే బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. వివేక్ చాలా తెలివైనవాడంటూ ప్రశంసించిన ట్రంప్ అతడి స్థానం ఏంటో ఇప్పుడే చెప్పలేనన్నారు.

News November 12, 2024

FBలో బాల్కనీ వీడియో పోస్టు.. అరెస్టు

image

బెంగళూరులోని MSRనగర్‌లో దంపతులు సాగర్ గురుంగ్, ఊర్మిళ నివసిస్తున్నారు. ఇటీవల ఊర్మిళ తమ బాల్కనీలోని గార్డెన్‌‌ను వీడియో తీసి ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. అయితే ఆ గార్డెన్‌లో ఉన్న మొక్కల్లో 2 గంజాయి మొక్కలున్నట్లు వీడియోలో కనిపించింది. వీడియో కాస్తా సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఇంకేముంది పోలీసులు అక్కడికి వెళ్లి ప్రశ్నించగా ఆ కపుల్ తడబడ్డారు. దీంతో వారిద్దరిని అరెస్ట్ చేశారు.

News November 12, 2024

LSGతో విడిపోవడానికి గల కారణం చెప్పేసిన రాహుల్

image

లక్నో జట్టుతో విడిపోవడానికి గల కారణాన్ని క్రికెటర్ KL.రాహుల్ వెల్లడించారు. తాను సరికొత్త ఆరంభాన్ని కోరుకుంటున్నాని, తనకు భావవ్యక్తీకరణ స్వేచ్ఛ ఉన్న చోట ఎక్కడైనా ఆడాలని అనుకుంటున్నానని తెలిపారు. కాగా గత సీజన్‌లో మ్యాచ్‌లు ఓడినప్పుడు కెప్టెన్ రాహుల్‌తో LSG ఓనర్ సంజీవ్ గొయెంకా కోపంతో మాట్లాడిన విషయం తెలిసిందే. అయితే తనకు LSGలో గౌరవం దక్కలేదనే రాహుల్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.