News September 3, 2024

ప్రకాశం బ్యారేజీకి మరింత తగ్గిన వరద

image

AP: విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకి క్రమంగా వరద ఉద్ధృతి తగ్గుతోంది. నిన్న 11 లక్షల క్యూసెక్కుల ప్రవాహం రాగా ప్రస్తుతం ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 9.79 లక్షలుగా ఉంది. 70 గేట్లు ఎత్తి నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. అటు తెలంగాణ నుంచి వచ్చే మున్నేరు నదికి సైతం ప్రవాహం తగ్గింది. దీంతో లంక గ్రామాలకు వరద ముప్పు తగ్గుతోంది.

Similar News

News September 18, 2024

ALERT.. రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

image

APలోని పలు జిల్లాల్లో రేపు వర్షాలు పడతాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అటు తెలంగాణలో ఈ నెల 21 నుంచి మళ్లీ వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది.

News September 18, 2024

చెలరేగిన అఫ్గాన్.. 106కే సఫారీలు ఆలౌట్

image

షార్జాలో సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి వన్డేలో అఫ్గానిస్థాన్ బౌలర్లు చెలరేగిపోయారు. వారి ధాటికి సఫారీలు 106 పరుగులకే చాప చుట్టేశారు. వియాన్ ముల్డర్ 52 పరుగులతో రాణించడంతో ప్రోటీస్ జట్టు ఆమాత్రం స్కోరైనా చేసింది. అఫ్గాన్ బౌలర్లలో ఫరూకీ 4, ఘజన్‌ఫర్ 3, రషీద్ 2 వికెట్లతో దక్షిణాఫ్రికా పతనాన్ని శాసించారు. అఫ్గాన్ బ్యాటర్లు ఎలా ఆడతారన్నది ఆసక్తికరంగా మారింది.

News September 18, 2024

కలెక్టరేట్‌లో లంచం.. పట్టుకున్న ఏసీబీ

image

TG: కొత్తగూడెం కలెక్టరేట్ ఆఫీసులో ఓ అవినీతి చేప ఏసీబీ వలకు చిక్కింది. రూ.1.14 లక్షలు లంచం తీసుకుంటూ జిల్లా హార్టికల్చర్ అధికారి సూర్యనారాయణ ఏసీబీకి చిక్కాడు. డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ ధ్రువీకరణ కోసం అధికారి లంచం డిమాండ్ చేశాడు. బాధితుడు డబ్బు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీ డీఎస్పీ రమేశ్ ఆధ్వర్యంలోని బృందం ఆయన్ను అదుపులోకి తీసుకుంది. ఎవరైనా లంచం అడిగితే 1064కు ఫిర్యాదు చేయండి.