News October 22, 2024
కాబోయే ‘సచిన్’ అన్నారు.. కానీ!
యంగ్ ఓపెనర్ పృథ్వీ షాకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. సచిన్, సెహ్వాగ్‌ల క్వాలిటీలున్నాయని, రాబోయే తరానికి మంచి బ్యాటర్ అని విశ్లేషణలు విన్పించాయి. కాగా ఇప్పటికే టీమ్ ఇండియాలో చోటు దక్కించుకోలేకపోతున్న షాను తాజాగా రంజీ ట్రోఫీలో ముంబై జట్టు సైతం ఫిట్నెస్, క్రమశిక్షణ వంటి కారణాలతో తొలగించింది. షా 5 టెస్టులు, 6 వన్డేలు, ఒక T20 ఆడారు. తొలి టెస్టులోనే సెంచరీ చేసి MOMగా నిలిచి రికార్డు సృష్టించారు.
Similar News
News November 4, 2024
BCCI తదుపరి సెక్రటరీగా రోహన్ జైట్లీ?
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (BCCI) కార్యదర్శిగా రోహన్ జైట్లీని నియమించే అవకాశం ఉందని వార్తలొస్తున్నాయి. ఈనెలలో జైషా ఈ పదవికి రాజీనామా చేసి DEC 1న ICC తదుపరి ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరిస్తారు. రోహన్ జైట్లీ 2020 నుంచి ఢిల్లీ క్రికెట్ బోర్డు అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి అనిల్ పటేల్ సైతం BCCI సెక్రటరీ పదవి కోసం పోటీ పడుతున్నారు. దీనిపై త్వరలో ప్రకటన రానుంది.
News November 4, 2024
లేబర్ షార్టేజ్ వల్ల నష్టాలేంటి?
* ఇన్ఫ్రా సహా కంపెనీల ప్రొడక్టివిటీ తగ్గుతుంది. ఇది ఎకనామిక్ ఔట్‌పుట్‌పై ప్రభావం చూపిస్తుంది * వర్కర్స్ మధ్య పోటీతో ఎక్కువ జీతాలు ఇవ్వాల్సి వస్తుంది. దీంతో ఇన్‌ఫ్లేషన్ ప్రెజర్ పెరుగుతుంది * కంపెనీలు, ప్రాజెక్టుల విస్తరణ ఆగిపోతుంది. దీంతో ఆ ప్రాంతాల డెవలప్మెంట్ లేటవుతుంది* లేబర్ రిక్రూటింగ్, ట్రైనింగ్, రిటైనింగ్‌కు కంపెనీలు భారీగా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఆపరేషనల్ బడ్జెట్ పెరుగుతుంది.
News November 4, 2024
టీచర్ ఎమ్మెల్సీ ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదల
ఏపీలో ఖాళీగా ఉన్న తూ.గో- ప.గో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో ఉప ఎన్నికకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 11న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలిపింది. నవంబర్ 18వరకు నామినేషన్లు స్వీకరించి, 21 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశమిస్తారు. DEC 5న పోలింగ్ నిర్వహించి 9వ తేదీన ఓట్ల లెక్కింపు చేపడతారు. కాగా ఈ స్థానంలో PDF MLC షేక్ సాబ్జీ గతేడాది రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో ఉపఎన్నిక నిర్వహిస్తున్నారు.