News March 3, 2025
ఉత్తరాంధ్ర టీచర్ MLCగా గాదె శ్రీనివాసులు విజయం

AP: ఉత్తరాంధ్ర టీచర్ MLCగా PRTU అభ్యర్థి గాదె శ్రీనివాసులు విజయం సాధించారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఆయన గెలుపొందారు. శ్రీనివాసులు 10,068 ఓట్ల మ్యాజిక్ ఫిగర్ దాటడంతో విజేతగా ప్రకటించారు. మరోవైపు, వెయ్యికి పైగా ఓట్లు తిరస్కరణకు గురయ్యాయి. విజేతను డిసైడ్ చేసే ప్రక్రియలో 8మందిని ఎలిమినేషన్ చేయాల్సి వచ్చింది. ఉదయం 8గంటలకు ప్రారంభమైన లెక్కింపు ప్రక్రియ 11గంటల పాటు సాగింది.
Similar News
News March 24, 2025
SLBC సహాయక చర్యలపై సీఎం కీలక ఆదేశాలు

TG: ఎస్ఎల్‌బీసీ సహాయక చర్యలను కొనసాగించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రెస్క్యూ నిరంతర పర్యవేక్షణకు సీనియర్ ఐఏఎస్ అధికారి శివశంకర్‌ను నియమిస్తూ వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలన్నారు. మృతదేహాలను వీలైనంత త్వరగా వెలికి తీసేలా చూడాలన్నారు. నిపుణుల కమిటీ సూచనలతో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకెళ్లాలని సూచించారు. ఈ ఘటన జరిగి నెలరోజులు దాటగా ఏడుగురి మృతదేహాలు దొరకాల్సి ఉంది.
News March 24, 2025
‘ఎల్2 ఎంపురాన్’ విడుదల.. కాలేజీకి సెలవు!

మోహన్‌లాల్ హీరోగా పృథ్వీరాజ్ తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రం ‘ఎల్2 ఎంపురాన్’ విడుదలకు ముందే భారీగా కలెక్షన్లు రాబడుతోంది. అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్‌లో ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా రూ.58 కోట్లు వచ్చినట్లు సినీవర్గాలు ప్రకటించాయి. అలాగే, బెంగళూరులోని ఓ కాలేజీ యాజమాన్యం విడుదల రోజైన ఈనెల 27న సెలవు ప్రకటించి విద్యార్థులకు ఉచితంగా టికెట్లు ఇచ్చినట్లు పేర్కొన్నాయి.
News March 24, 2025
పఠాన్ కామెంటరీపై నిషేధం..? కారణం అదేనా?

మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ గత ఏడాది IPLలో కామెంటరీతో అలరించారు. ఈ ఏడాది మాత్రం ఆయన జాడ లేదు. కామెంటరీ నుంచి ఆయన్ను నిషేధించడమే కారణమని సమాచారం. BCCI వర్గాల సమాచారం ప్రకారం.. గతంలో తనతో విభేదాలున్న ఆటగాళ్లపై ఆయన లైవ్ కామెంటరీలోనే పరోక్షంగా విమర్శలు లేదా కామెంట్లు చేస్తుండటం ప్రసారదారులకు ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఆయన్ను కామెంటరీ కాంట్రాక్ట్ నుంచి మినహాయించినట్లు తెలుస్తోంది.