News September 27, 2024
హైకోర్టుకు గజ్జల లక్ష్మి.. తీర్పు రిజర్వు

AP: రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్గా తన నియామకాన్ని ప్రభుత్వం రద్దు చేయడం పట్ల గజ్జల లక్ష్మి హైకోర్టును ఆశ్రయించారు. 2026 వరకు రాజ్యాంగబద్ధ హోదాలో పదవీకాలం ఉన్నప్పటికీ రాజకీయ ప్రయోజనాల కోసం తనను తొలగించారని కోర్టుకు తెలిపారు. అయితే పిటిషనర్ కేవలం పరిమిత కాలానికి మాత్రమే నియమించబడ్డారని, ఆగస్టుతో పదవీ కాలం ముగిసిందని ప్రభుత్వ తరఫు న్యాయవాది అన్నారు. వాదనల అనంతరం తీర్పును కోర్టు రిజర్వు చేసింది.
Similar News
News November 21, 2025
ఖమ్మం: మధ్యాహ్న భోజన వ్యయం పెంపు

ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం నాణ్యత పెంచేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ‘కుకింగ్ కాస్ట్’ను పెంచుతూ పాఠశాల విద్యాశాఖ జీవో జారీ చేసింది. దీని ప్రకారం, ప్రాథమిక స్థాయి విద్యార్థికి ఖర్చు రూ.6.19 నుంచి రూ.6.78కి, ఉన్నత పాఠశాల స్థాయి విద్యార్థికి రూ.11.79 నుంచి రూ.13.17కు పెరిగింది. హెచ్ఎంలు వెంటనే బిల్లులు పంపాలని ఆదేశించారు.
News November 21, 2025
సత్యసాయి రూ.100 నాణెం.. ఇలా కొనుగోలు చేయొచ్చు

AP: శ్రీసత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో ప్రధాని మోదీ ఆవిష్కరించిన బాబా స్మారక రూ.100 నాణేలను సొంతం చేసుకునేందుకు భక్తులు ఆసక్తిచూపుతున్నారు. https://www.indiagovtmint.inలో మాత్రమే వీటిని కొనుగోలు చేయవచ్చు. ఒక్కో కాయిన్ ధర రూ.5,280. నాణెంతోపాటు ఆయన జీవిత విశేషాల బుక్లెట్ కూడా అందుతుంది. ఆన్లైన్ పేమెంట్తో బుక్ చేసుకున్న నెల రోజుల్లోపు వీటిని ఇంటికి పంపుతారు.
News November 21, 2025
మరికొన్ని ఎర పంటలు- ఈ పంటలకు మేలు

☛ క్యాబేజీలో డైమండ్ బ్యాక్ మాత్ను ఆవాలు పంట వేసి నివారించవచ్చు.☛ అలసందలో ఆవాలు వేసి గొంగళిపురుగు, పొద్దుతిరుగుడు వేసి కాయతొలుచు పురుగులను నివారించవచ్చు. ☛ బంతిని ఎర పంటగా వేసి, కంది పంటను ఆశించే శనగపచ్చ పురుగును అరికట్టవచ్చు. ఈ జాతికి చెందిన ఆడ పురుగులు బంతి పూలపై గుడ్లు పెడతాయి. ఆ తర్వాత లార్వాను సేకరించి నాశనం చేయొచ్చు. ☛ టమాటాలో కాయతొలుచు పురుగు ఉద్ధృతిని తగ్గించడానికి బంతిని ఎర పంటగా వేయాలి.


