News October 27, 2024
సీనియర్లకు షాకిచ్చిన గంభీర్!
న్యూజిలాండ్ చేతిలో ఘోర <<14459559>>ఓటమితో <<>>భారత కోచ్ గంభీర్ కఠిన చర్యలకు దిగినట్లు సమాచారం. ఇంతకాలం సీనియర్లకున్న ఆప్షనల్ ట్రైనింగ్ సెషన్ అవకాశాన్ని రద్దు చేసినట్లు తెలుస్తోంది. కోహ్లీ, రోహిత్, బుమ్రా వంటి స్టార్లకు గతంలో ఇది ఆప్షనల్‌గా ఉండేది. ఇకపై ప్రతి ఒక్క ప్లేయర్ పక్కాగా హాజరుకావాలని మేనేజ్‌మెంట్ స్పష్టం చేసినట్లు సమాచారం. NOV 1 నుంచి 3వ టెస్ట్ ప్రారంభం కానుండగా, OCT 30-31 వరకు ట్రైనింగ్ నిర్వహించనుంది.
Similar News
News November 14, 2024
మధ్యాహ్న భోజనం నాణ్యతలో రాజీ వద్దు: పవన్
AP: విద్యార్థులకు ‘డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం’ ద్వారా అందిస్తున్న ఆహారం నాణ్యతలో రాజీ పడవద్దని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు. ఈ పథకానికి ప్రభుత్వం రూ.1,854 కోట్లు కేటాయించిందని తెలిపారు. కొన్ని పాఠశాలల్లో నాణ్యతా లేదనే ఫిర్యాదులు తన దృష్టికి రావడంతో ఆయన ఇలా స్పందించారు. అధికారులు తనిఖీలు చేపట్టి, నాణ్యతా ప్రమాణాలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
News November 14, 2024
భయపెట్టిన క్లాసెన్, జాన్సెన్
భారత్, సౌతాఫ్రికా మధ్య 3వ టీ20 తీవ్ర ఉత్కంఠగా సాగింది. చివర్లో హెన్రిచ్ క్లాసెన్ 41(22 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్సర్లు), మార్కో జాన్సెన్ 54(17బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లు) భారత బౌలర్లకు చెమటలు పట్టించారు. చక్రవర్తి వేసిన 14వ ఓవర్‌లో క్లాసెన్ హ్యాట్రిక్ సిక్సులతో మొత్తం 22 రన్స్ కొట్టారు. హార్దిక్ వేసిన 19వ ఓవర్లో జాన్సెన్ (4, 6, 4, 2, 6, 4) మొత్తం 26 రన్స్ బాదారు. వీరు ఔటవడంతో భారత్ <<14604651>>గెలిచింది<<>>.
News November 14, 2024
పుట్టినరోజు శుభాకాంక్షలు
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.