News November 10, 2024
రేపు గంభీర్ ప్రెస్ మీట్
బోర్డర్ గవాస్కర్ సిరీస్ కోసం భారత్ ఆస్ట్రేలియాలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రేపు ఆస్ట్రేలియాకు బయలుదేరుతున్న గంభీర్ ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారు. న్యూజిలాండ్ సిరీస్‌లో భారత్ వైట్ వాష్‌కు గురవ్వడంపైనా ఆయన స్పందించే అవకాశం ఉంది. BGTలో తొలి టెస్టు ఈ నెల 22న పెర్త్‌లో మొదలుకానుండగా ఇప్పటికే పలువురు ఆటగాళ్లు ఆస్ట్రేలియా బయలుదేరారు.
Similar News
News December 2, 2024
మోస్ట్ డిజాస్టర్ మూవీగా ‘కంగువ’!
తమిళ స్టార్ నటుడు సూర్య నటించిన పీరియాడికల్ యాక్షన్ చిత్రం ‘కంగువ’ థియేట్రికల్ రన్ పూర్తయినట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. నెగటివ్ టాక్ తెచ్చుకోవడంతో ఈ భారీ బడ్జెట్ చిత్రం రూ.130 కోట్ల నష్టంతో ఆల్‌టైమ్ డిజాస్టర్‌గా నిలిచినట్లు వెల్లడించాయి. ఇప్పటివరకు ప్రభాస్ నటించిన ‘రాధేశ్యామ్’ సినిమా పేరిట ఈ చెత్త రికార్డు ఉండేది. ఈ మూవీ రూ.120 కోట్లు నష్టపోయింది. కాగా మరికొన్ని రోజుల్లో ‘కంగువ’ OTTలోకి రానుంది.
News December 2, 2024
ఉద్యోగుల అంత్యక్రియల ఛార్జీలు పెంపు
TG: ప్రభుత్వ ఉద్యోగి మరణిస్తే ఇచ్చే అంత్యక్రియల ఛార్జీలను రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. ఖర్చును రూ.20 వేల నుంచి రూ.30వేలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. మొదటి వేతన సవరణ కమిషన్ సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది.
News December 2, 2024
విండ్ ఫాల్ టాక్స్ రద్దు చేసిన కేంద్రం
ముడి చమురు ఉత్పత్తుల ఎగుమతులపై విధించే విండ్‌ఫాల్ టాక్స్‌ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఈ నిర్ణయం వల్ల రిలయన్స్, ONGC వంటి సంస్థలకు ప్రయోజనం చేకూరనుంది. దేశీయ సంస్థలు ముడి చమురు ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసినప్పుడు ఈ టాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. యుద్ధం, ద్రవ్యోల్బణం వంటి పరిస్థితుల్లో విదేశాల్లో ధరలు పెరిగినప్పుడు ఆ సంస్థలు ఆయా దేశాలకు ఉత్పత్తులను ఎగుమతి చేసి లాభాలు ఆర్జిస్తుంటాయి.