News March 9, 2025
భారత్ గెలుస్తుందా అంటూ గంభీర్ ప్రశ్న.. ఫ్యాన్స్ ఆగ్రహం

‘భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ గెలుస్తుందా? రోహిత్-కోహ్లీ జోడీ గెలిపిస్తారా?’. ఇవీ టీమ్ ఇండియా హెడ్ కోచ్ గంభీర్ ట్విటర్ ఖాతాలో ప్రత్యక్షమైన ప్రశ్నలు. ఓ బెట్టింగ్ పోర్టల్‌ను ప్రమోట్ చేస్తూ గంభీర్ ఆ ట్వీట్ చేశారు. ఆ ప్రమోషనే తప్పంటే.. హెడ్ కోచ్ అయి ఉండీ భారత్ గెలుస్తుందా అని అడగడమేంటంటూ భారత అభిమానులు ఫైరవుతున్నారు. మరోవైపు.. అది ముందే షెడ్యూల్ అయిన ట్వీట్ అంటూ ఆయన ఫ్యాన్స్ సపోర్ట్‌గా నిలుస్తున్నారు.
Similar News
News March 10, 2025
కెప్టెన్‌గా రోహిత్ శర్మ గెలిచిన ట్రోఫీలు ఇవే

☞ IPL: 2013, 2015, 2017, 2019, 2020 (MI)
☞ CL టీ20: 2013
☞ ఆసియా కప్: 2018, 2023
☞ నిదహాస్ ట్రోఫీ-2018
☞ టీ20 వరల్డ్ కప్-2024
☞ ఛాంపియన్స్ ట్రోఫీ-2025
News March 10, 2025
NZ అంటే చాలు.. రెచ్చిపోతాడు!

వన్డే ఫార్మాట్లో న్యూజిలాండ్‌పై భారత బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఇప్పటివరకు ఆ జట్టుపై శ్రేయస్ వరుసగా 103, 52, 62, 80, 49, 33, 105, 79, 48 రన్స్ చేశారు. అలాగే ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక పరుగులు (243) చేసిన భారత బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పారు. ఈ టోర్నీలో ఆయన 15, 56, 79, 45, 48 రన్స్ సాధించారు.
News March 9, 2025
భారత జట్టుకు అభినందనల వెల్లువ

ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన భారత జట్టుకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర మంత్రులు, తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు. టీమ్ ఇండియా మరోసారి తన సత్తా చాటిందని, గర్వపడేలా చేసిందని AP సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, మంత్రులు సోషల్ మీడియా వేదికగా తమ సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు.