News January 16, 2025

జూదాన్ని రాష్ట్రక్రీడగా మార్చేశారు: YSRCP

image

AP: కూటమి నేతలు సంప్రదాయం ముసుగులో జూదాన్ని రాష్ట్ర క్రీడగా మార్చేశారని YCP ఆరోపించింది. ‘పండుగ రోజుల్లో దగ్గరుండి మరీ ప్రతి ఊరిలో జూదం, కోడి పందేలు నిర్వహించారు. ప్రతి బరి నుంచి భారీగా కమీషన్లు వసూలు చేస్తూ నాయకులు బాగుపడ్డారు. కానీ జూదంలో డబ్బులు పోయిన వాళ్లు ఒట్టి చేతులతో ఇళ్లకు వెళ్తున్నారు. ప్రజలు ఏమైపోతేనేం తాము బాగుపడితే చాలన్నది చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లక్ష్యంగా ఉంది’ అని ట్వీట్ చేసింది.

Similar News

News January 27, 2026

హాలీవుడ్ బోర్డుపై లోదుస్తులు.. నటిపై క్రిమినల్ కేసులు!

image

లాస్‌ఏంజెలిస్(US)లోని హాలీవుడ్‌ బోర్డుపై లోదుస్తులు వేలాడదీసి నటి సిడ్నీ స్వీనీ వివాదంలో చిక్కుకున్నారు. తన కొత్త బ్రాండ్‌ ప్రమోషన్‌లో భాగంగా బోర్డుపైకి ఎక్కి బ్రాలను దండగా కట్టి వేలాడదీశారు. ఈ వీడియో వైరల్‌గా మారింది. దీంతో హాలీవుడ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమెపై క్రిమినల్ కేసులు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రచారం కోసం చేసిన స్టంట్ స్వీనీకి సమస్యలు తెచ్చిపెట్టింది.

News January 27, 2026

ఐఐటీ గువాహటిలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

image

<>IIT <<>>గువాహటిలో 5 ప్రాజెక్ట్ సైంటిస్ట్, అసోసియేట్ ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. పోస్టును బట్టి PhD(VLSI/మైక్రో ఎలక్ట్రానిక్స్/CS), MTech/ME, BE/BTech(RTL డిజైన్/ డేటా వెరిఫికేషన్) అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ప్రాజెక్ట్ సైంటిస్ట్‌కు నెలకు రూ.68,450, అసోసియేట్ ప్రాజెక్ట్ ఇంజినీర్‌కు రూ.43,250 చెల్లిస్తారు. సైట్: https://iitg.ac.in

News January 27, 2026

మోహన్ బాబుకు బెంగాల్ ఎక్సలెన్స్ అవార్డు

image

డైలాగ్ కింగ్ మోహన్ బాబుకు అరుదైన గౌరవం లభించింది. ప్రతిష్ఠాత్మక అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్‌ పురస్కారాన్ని వెస్ట్ బెంగాల్ గవర్నర్ ఆనంద బోస్ చేతుల మీదుగా అందుకున్నారు. టాలీవుడ్ నుంచి ఈ అవార్డు అందుకున్న మొదటి వ్యక్తి ఆయనే. 5 దశాబ్దాలుగా ఇండస్ట్రీలో ఆయన చేసిన సేవలకు ఈ అవార్డు అందజేసినట్లు సినీ వర్గాలు తెలిపాయి. అమితాబ్-దీపిక నటించిన ‘పీకు(piku)’ డైరెక్టర్ షూజిత్ సిర్కార్ సైతం ఈ పురస్కారం అందుకున్నారు.