News August 7, 2024
‘గేమ్ ఛేంజర్’ డబ్బింగ్ మొదలైంది: SVC

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ చాలాకాలంగా ‘గేమ్ ఛేంజర్’ సినిమా అప్‌డేట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈరోజు డబ్బింగ్ పనుల్ని ప్రారంభించామంటూ వారికి నిర్మాణ సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది క్రిస్మస్‌కు మెగా ఫైర్‌వర్క్స్‌కు అంతా సిద్ధమవుతోందని ట్వీట్ చేసింది. శంకర్ దర్శకత్వంలో రామ్‌చరణ్, కియారా అద్వానీ జంటగా గేమ్ ఛేంజర్ తెరకెక్కింది. మూవీలో చరణ్ రెండు విభిన్న పాత్రల్లో కనిపిస్తారని సమాచారం.
Similar News
News October 21, 2025
ఏపీ, తెలంగాణ న్యూస్ అప్‌డేట్స్

*సీపీఐ ఏపీ కార్యదర్శిగా గుజ్జుల ఈశ్వరయ్య ఎన్నిక
*TTD గోశాలలో గోవుల మృతిపై భూమన కరుణాకర్ ఆరోపణలు. ఈ నెల 23న విచారణకు హాజరుకావాలని పోలీసుల నోటీసులు
*నిజామాబాద్‌లో రియాజ్ ఎన్‌కౌంటర్ ఘటనను సుమోటోగా స్వీకరించిన తెలంగాణ మానవ హక్కుల సంఘం. నవంబర్ 24లోగా పూర్తి నివేదిక ఇవ్వాలని డీజీపీకి ఆదేశాలు
*భీమవరం డీఎస్పీపై ప.గో. ఎస్పీకి డిప్యూటీ సీఎం పవన్ ఫిర్యాదు. సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకోకుండా చూడాలని సూచన
News October 21, 2025
స్టీమింగ్‌తో ఎన్నో బెనిఫిట్స్

ముఖానికి ఆవిరి పట్టడం వల్ల చర్మం లోపలి నుండి శుభ్రపడుతుంది. రక్తప్రసరణ మెరుగుపడి చర్మం మెరుస్తుందంటున్నారు నిపుణులు. స్టీమ్ ఫేషియల్ చేయడానికి ముందు ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. నీటిలో మీకు నచ్చిన హెర్బ్స్ వేసుకోవచ్చు. ముఖానికి పాత్రకు మధ్య కనీసం 8-10 అంగుళాల దూరం ఉండాలి. 5-10 నిమిషాల పాటు ఆవిరి పట్టిన తర్వాత ముఖాన్ని చల్లని నీటితో కడిగి మాయిశ్చరైజర్ రాసుకుంటే చాలు. మెరిసే ముఖం మీ సొంతం.
News October 21, 2025
Asia Cup: నఖ్వీకి బీసీసీఐ వార్నింగ్!

ACC చీఫ్ నఖ్వీ విషయంలో తాడోపేడో తేల్చుకోవడానికి BCCI సిద్ధమైంది. Asia Cup ట్రోఫీని భారత్‌కు అప్పగించాలంటూ మెయిల్ పంపింది. ఇవ్వకపోతే ICCకి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించింది. నఖ్వీ నుంచి స్పందన రాకపోతే విషయాన్ని ఐసీసీ ఎదుటే తేల్చుకుంటామని బీసీసీఐ సెక్రటరీ సైకియా అన్నారు. నఖ్వీ చేతుల మీదుగా ఆసియా కప్ తీసుకోవడానికి భారత క్రికెటర్లు నిరాకరించడంతో ఆయన ట్రోఫీని వెంట తీసుకెళ్లిన విషయం తెలిసిందే.