News November 21, 2024
అమరావతిలో ‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్?
రామ్‌చరణ్ హీరోగా నటిస్తోన్న ‘గేమ్ చేంజర్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను అమరావతిలో నిర్వహించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. జనవరి తొలి వారంలో జరిగే ఈ ఈవెంట్‌కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గెస్ట్‌గా హాజరయ్యే అవకాశం ఉందని పేర్కొన్నాయి. ఒకవేళ ఇదే జరిగితే Dy.CM అయ్యాక ఆయన హాజరైన తొలి సినిమా ఈవెంట్ ఇదే కానుంది. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ జనవరి 10న థియేటర్లలోకి రానుంది.
Similar News
News December 5, 2024
ప్రీమియర్ షోలకు టికెట్ రేట్లు ఎక్కువగా ఉంటే వెళ్లొద్దు: హైకోర్టు
AP: పుష్ప-2 టికెట్ ధరలను ఈ నెల 17 వరకు పెంచుకునేందుకు ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టులో పిల్ దాఖలైంది. ప్రీమియర్ షోలకు టికెట్ ధరలు ఎక్కువగా ఉన్నాయనుకుంటే మూవీకి వెళ్లొద్దని పిటిషనర్‌కు ధర్మాసనం సూచించింది. సినిమా టికెట్లపై కాకుండా విస్తృత ప్రజా ప్రయోజనాలు ఇమిడి ఉన్న అంశాలతో వ్యాజ్యాలు వేయాలంది. ఈ పిల్‌పై తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని పేర్కొంటూ తీర్పును రిజర్వ్ చేసింది.
News December 5, 2024
పుష్ప-2 REVIEW& RATING
పుష్ప-1లో ఎర్రచందనం స్మగ్లింగ్ సిండికేట్ లీడర్‌గా ఎదిగిన పుష్పరాజ్ అంతర్జాతీయ స్థాయికి ఎలా చేరాడన్నదే కథ. జాతర సీక్వెన్స్, క్లైమాక్స్‌లో బన్నీ నటవిశ్వరూపం చూపించారు. శ్రీవల్లి నటన, ప్రీ ఇంటర్వెల్, సాంగ్స్ ప్లస్. సెకండాఫ్‌లో ఎమోషన్లకు పెద్దపీట వేసిన డైరెక్టర్ స్టోరీలో కీలకమైన స్మగ్లింగ్‌ను పక్కనబెట్టారు. సాగదీత సీన్లు, రన్‌టైమ్, విలనిజంలో బలం లేకపోవడం మైనస్. సుక్కు మార్క్ మిస్ అయింది.
RATING: 3/5
News December 5, 2024
నేడు విచారణకు రానున్న హరీశ్ రావు క్వాష్ పిటిషన్
TG: పంజాగుట్ట పీఎస్‌లో తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ మాజీ మంత్రి హరీశ్ రావు వేసిన క్వాష్ పిటిషన్ ఇవాళ హైకోర్టులో విచారణకు రానుంది. రాజకీయ దురుద్దేశంతో ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తనపై తప్పుడు కేసు నమోదు చేశారని ఆయన అందులో పేర్కొన్నారు. కాగా ఎన్నికల సమయంలో తనతో పాటు తన కుటుంబ సభ్యుల ఫోన్లను హరీశ్ రావు ట్యాప్ చేశారని సిద్దిపేటలో ఆయనపై పోటీ చేసిన కాంగ్రెస్ నేత చక్రధర్ గౌడ్ ఫిర్యాదు చేశారు.