News April 29, 2024
మే 1 నుంచి చెన్నైలో ‘గేమ్ ఛేంజర్’ షూటింగ్

శంకర్ డైరెక్షన్‌లో రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ మూవీ షూటింగ్ మే 1 నుంచి చెన్నైలో జరగనుందట. హైదరాబాద్ షెడ్యూల్ ఇవాళ పూర్తయిందని సినీవర్గాలు తెలిపాయి. శంషాబాద్‌లో రామ్ చరణ్, సునీల్, నవీన్ చంద్ర కాంబోలో పలు సన్నివేశాలను చిత్రీకరించినట్లు సమాచారం. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
Similar News
News April 20, 2026
చేతికి రెండు ఫ్రాక్చర్లు.. అయినా మూడు వికెట్లు

ఫామ్ లేమితో సతమతమైన KKR స్టార్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఎట్టకేలకు నిన్న RRతో జరిగిన మ్యాచ్‌లో కమ్‌బ్యాక్ ఇచ్చారు. 4 ఓవర్లు వేసి 14 రన్స్ మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టారు. అయితే IPL సీజన్‌కు ముందు తాను గాయపడ్డట్లు వరుణ్ తెలిపారు. ఇప్పటికీ లెఫ్ట్ హ్యాండ్‌లో 2 ఫ్రాక్చర్స్ ఉన్నట్లు వెల్లడించారు. ఆ నొప్పితోనే బౌలింగ్ చేస్తున్నట్లు చెప్పారు. దాన్ని అధిగమించడానికే ట్రై చేస్తున్నట్లు తెలిపారు.
News April 20, 2026
మెగాస్టార్ సినిమాలో అనిల్ కపూర్?

మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ కాంబినేషన్‌లో వస్తున్న మూవీలో బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ఇటీవల బాబీ ఆయనకు కథ వినిపించగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. ఈ సినిమాలో మోహన్‌లాల్ కూడా నటిస్తున్నట్లు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. వీరిద్దరి రోల్స్ కన్ఫర్మ్ అయితే మెగా సినిమాకు పాన్ ఇండియా హిట్ ఖాయమని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
News April 20, 2026
చరిత్ర సృష్టించిన పంజాబ్

IPLలో పంజాబ్ కింగ్స్ చరిత్ర సృష్టించింది. ఒక సీజన్లో ఆడిన తొలి 6 మ్యాచుల్లో ఒక్క ఓటమి ఎరుగని ఫస్ట్ టీమ్‌గా నిలిచింది. KKRతో మ్యాచ్ వర్షం వల్ల రద్దు కాగా మొత్తం 11 పాయింట్లతో టాప్ ప్లేస్‌లో నిలిచింది. ఆ తర్వాత ఆర్సీబీ (8 పాయింట్లు), రాజస్థాన్ (8 పాయింట్లు), సన్‌రైజర్స్ (6 పాయింట్లు) ఉన్నాయి. ఇక ఇప్పటివరకు కేవలం ఒకే ఒక మ్యాచ్ గెలిచిన ముంబై ఇండియన్స్ 2 పాయింట్లతో లాస్ట్ ప్లేస్‌లో ఉంది.


