News January 9, 2025
‘గేమ్ ఛేంజర్’ టికెట్ ధరల పెంపు.. బీఆర్ఎస్ విమర్శలు
TG: సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ టికెట్ ధరలు పెంచబోమని సీఎం <<14942759>>రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా<<>> ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా గేమ్ ఛేంజర్ మూవీకి టికెట్ ధరలు పెంచేందుకు పర్మిషన్‌తో పాటు ఎక్స్‌ట్రా షోలకు అనుమతివ్వడంపై బీఆర్ఎస్ శ్రేణులు విమర్శలకు దిగాయి. నెల తిరగక ముందే సీఎం మాట మార్చారని పోస్టులు చేస్తున్నాయి. ప్రభుత్వ నిర్ణయంపై మీ కామెంట్?
Similar News
News January 22, 2025
మీ పిల్లలకు ఈ పాటనూ నేర్పించండి!
ఇప్పుడంటే పిల్లలకు ‘ట్వింకిల్.. ట్వింకిల్ లిటిల్ స్టార్’ అంటూ రైమ్స్ నేర్పిస్తున్నారు. కానీ, ఒకప్పుడు తెలుగు పద్యాలు ఎంతో వినసొంపుగా ఉండేవి. ముఖ్యంగా 60లలో ఉండే పద్యాన్ని ఓ నెటిజన్ గుర్తుచేశారు. ‘బుర్రు పిట్ట బుర్రు పిట్ట తుర్రు మన్నది. పడమటింటి కాపురం చేయనన్నది. అత్త ఇచ్చిన కొత్త చీర కట్టనన్నది. మామ తెచ్చిన మల్లెమొగ్గ ముడువనన్నది. మగని చేత మొట్టికాయ తింటానన్నది’ ఇదే ఆ పాట. ఇది మీరు విన్నారా?
News January 22, 2025
అమెరికా నుంచి 18000 మంది వెనక్కి!
డొనాల్డ్ ట్రంప్ పాలసీలకు తగినట్టు భారత్ ప్రణాళికలు వేసుకుంటోంది. USతో అనవసరంగా ట్రేడ్‌వార్ తెచ్చుకోకుండా ఉండేందుకు 18,000 అక్రమ వలసదారులను వెనక్కి తీసుకొచ్చేందుకు సిద్ధమైనట్టు తెలిసింది. 2 దేశాలూ కలిసి వీరిని గుర్తించాయి. స్టూడెంట్, వర్క్ వీసాలతో లీగల్‌గా అక్కడికి వెళ్లినవారికి అడ్డంకులు రావొద్దనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. లేదంటే వీసాలు, గ్రీన్‌కార్డులు తగ్గించి ట్రంప్ తిప్పలు పెట్టొచ్చు.
News January 22, 2025
రిలేషన్‌కు బ్రేకప్ చెబుతారనే సంకేతాలు ఇవి..
సైకాలజిస్టుల ప్రకారం మీతో రిలేషన్‌ను మీ పార్ట్నర్ ముగించాలని డిసైడ్ అయితే ఇలా తెలుస్తుంది
– ఒకప్పటిలా మీతో సన్నిహితంగా ఉండకపోవడం/ సరిగా స్పందించకపోవడం/ కారణాలు ఎక్కువ చెప్పడం/ గొడవలు పెరగడం/కేరింగ్ & షేరింగ్ తగ్గడం
– తనతో ఫ్యూచర్ గురించి చెబితే అనాసక్తి చూపడం
– క్లోజ్ రిలేషన్ కాకుండా ఫార్మల్‌గా ఉండటం
– మరొకరితో పోల్చడం, ఇతరుల గురించి మాట్లాడటం
– ప్రతి విషయాన్ని గుచ్చి చూడటం, లెక్కగట్టడం