News July 8, 2024
అతి త్వరలో గేమ్ ఛేంజర్ అప్డేట్స్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ ‘గేమ్ ఛేంజర్’. ఈ సినిమాలో చెర్రీ పార్ట్ షూటింగ్ పూర్తైనట్లు నిర్మాణ సంస్థ SVC ప్రకటించింది. షూటింగ్ మొదలైన దగ్గర నుంచి చివరి వరకు మెగా పవర్ ప్యాక్డ్ జర్నీ అంటూ చరణ్ ఫొటోను పంచుకుంది. ‘మార్పు కోసం ఆడే ఆట’ అని ట్వీట్ చేసింది. అతి త్వరలోనే సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్స్ ఇవ్వనున్నట్లు పేర్కొంది.
Similar News
News January 18, 2025
ఛాంపియన్స్ ట్రోఫీ.. భారత జట్టు ప్రకటన
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో పాల్గొనే భారత జట్టును కెప్టెన్ రోహిత్ శర్మ, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ ప్రకటించారు.
టీమ్: రోహిత్ శర్మ (C), గిల్(VC), జైస్వాల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, పంత్, శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్య, జడేజా, అక్షర్ పటేల్, సుందర్, కుల్దీప్, బుమ్రా, షమీ, అర్ష్‌దీప్ సింగ్.
News January 18, 2025
నేను నేరం చేయలేదు: కోర్టులో సంజయ్
కోల్‌కతా హత్యాచార ఘటనలో దోషిగా కోర్టు నిర్ధారించిన <<14530358>>సంజయ్ రాయ్<<>> తాను నిర్దోషిని అని వాదించాడు. ఈ రోజు కోర్టు తీర్పు వెల్లడించే ముందు జడ్జితో ‘నేను ఈ నేరం చేయలేదు’ అని చెప్పాడు. గతంలో కూడా ఇతడు ఇదే తరహా కామెంట్లు చేశాడు. అటు అతడు ఇలా చేశాడంటే నమ్మలేకపోతున్నామని రాయ్ కుటుంబం పేర్కొంది. కోల్‌కతాలోని శంభునాథ్ స్లమ్‌లో ఒక గదిలో ఉండే వీరి కుటుంబం.. పోరాడే శక్తి సైతం తమకు లేదని ఆవేదన వ్యక్తం చేసింది.
News January 18, 2025
పవన్ కళ్యాణ్ అభిమానులకు మళ్లీ నిరాశే?
హీరో నితిన్, వెంకీ కుడుముల కాంబోలో తెరకెక్కుతోన్న ‘రాబిన్ హుడ్’ మార్చి 28న విడుదల కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు షాక్ అవుతున్నారు. ఆయన నటిస్తోన్న ‘హరిహర వీరమల్లు’ సైతం అదేరోజున విడుదలకానుంది. నితిన్ మూవీ అప్డేట్‌తో HHVM వాయిదా పడుతుందనే వార్తలొస్తున్నాయి. అదే జరిగితే రాబిన్ హుడ్‌తో పాటు VD12, మ్యాడ్ స్క్వేర్ కూడా ఇదే తేదీలో విడుదలయ్యే ఛాన్స్ ఉంది.