News January 18, 2025
నేను నేరం చేయలేదు: కోర్టులో సంజయ్

కోల్‌కతా హత్యాచార ఘటనలో దోషిగా కోర్టు నిర్ధారించిన <<14530358>>సంజయ్ రాయ్<<>> తాను నిర్దోషిని అని వాదించాడు. ఈ రోజు కోర్టు తీర్పు వెల్లడించే ముందు జడ్జితో ‘నేను ఈ నేరం చేయలేదు’ అని చెప్పాడు. గతంలో కూడా ఇతడు ఇదే తరహా కామెంట్లు చేశాడు. అటు అతడు ఇలా చేశాడంటే నమ్మలేకపోతున్నామని రాయ్ కుటుంబం పేర్కొంది. కోల్‌కతాలోని శంభునాథ్ స్లమ్‌లో ఒక గదిలో ఉండే వీరి కుటుంబం.. పోరాడే శక్తి సైతం తమకు లేదని ఆవేదన వ్యక్తం చేసింది.
Similar News
News February 11, 2025
BIG BREAKING: బీర్ల ధరలు పెంపు

తెలంగాణలో మందుబాబులకు షాక్. బీర్ల ధరలను ప్రస్తుతం ఉన్న ధరపై 15శాతం పెంచుతూ ఎక్సైజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. పెరిగిన ధరలు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే ఏపీలో రూ.99 మద్యం, బీర్ల ధరలు తప్ప మిగతా మద్యం ధరలను ప్రభుత్వం పెంచింది.
News February 11, 2025
APSRTC ఉద్యోగులకు తీపికబురు

APSRTC ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2017 పీఆర్సీ బకాయిలో మరో 25 శాతం చెల్లింపునకు సంస్థ ఎండీ ద్వారకా తిరుమలరావు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో దాదాపు రూ.60 కోట్ల మేర ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. కాగా ఇప్పటికే 50 శాతం బకాయిలు చెల్లించినట్లు ఆయన గతంలో వెల్లడించారు.
News February 11, 2025
మీ అకౌంట్‌లో డబ్బులు పడ్డాయా?

TG: రైతు భరోసా పథకం కింద జనవరి 27 నుంచి ఇప్పటి వరకు 30,11,329 మంది రైతులకు ₹1,834.09 కోట్లు జమ చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. జనవరి 27న 577 ఎంపిక చేసిన గ్రామాల్లో 4.41 లక్షల మందికి, ఫిబ్రవరి 5న ఎకరం లోపు సాగు చేస్తున్న 17.03లక్షల మందికి, ఇవాళ 2 ఎకరాలలోపు సాగు చేస్తున్న 8.65 లక్షల మంది ఖాతాల్లో రూ.707.54 కోట్లు జమ చేసినట్లు తెలిపింది. మరి మీ అకౌంట్‌లో డబ్బులు పడ్డాయా?