News September 22, 2024

ఈ హ్యాండిల్‌తోనే ‘గేమ్ ఛేంజర్’ అప్డేట్స్

image

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు ‘గేమ్ ఛేంజర్’ సినిమా అప్డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈక్రమంలో వరుస అప్డేట్స్ ఇచ్చేందుకు మేకర్స్ ట్విటర్‌లో ‘GameChangerOffl’ అనే అకౌంట్‌ను క్రియేట్ చేశారు. ఈ అకౌంట్‌లో త్వరలోనే అదిరిపోయే అప్డేట్‌ రాబోతోందని మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ట్వీట్ చేశారు. కాగా, సెకండ్ సింగిల్ విడుదల అవుతుందని సినీవర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

Similar News

News November 10, 2025

జీఎస్టీ సంస్కరణలు.. 50% పెరిగిన నెక్సాన్ సేల్స్

image

జీఎస్టీ సంస్కరణలు, పండుగ సీజన్‌తో అక్టోబర్‌లో ఆటోమొబైల్ సేల్స్ పెరిగాయి. SUV మార్కెట్‌లో పోటీదారుగా ఉన్న హ్యుందాయ్ క్రెటా, మారుతీ సుజుకీ బ్రెజా సేల్స్‌ను టాటా నెక్సాన్ బీట్ చేసింది. 2024 అక్టోబర్‌తో పోలిస్తే ఈ సంవత్సరం అక్టోబర్‌లో ఈ మోడల్ సేల్స్ 50% పెరిగాయి. 2025 అక్టోబర్‌లో క్రెటా 18,381, నెక్సాన్ 22,083, బ్రెజా 12,072 యూనిట్లు సేల్ అయ్యాయి. నెక్సాన్ బేస్ మోడల్ రూ.7.32 లక్షల నుంచి మొదలవుతుంది.

News November 10, 2025

అందుకే నెక్లెస్ ధరించా: అల్లు శిరీష్

image

నిశ్చితార్థ వేడుకలో తాను నెక్లెస్ ధరించడంపై వస్తోన్న మీమ్స్‌పై టాలీవుడ్ యంగ్ హీరో అల్లు శిరీశ్ స్పందించారు. ‘దీనికే ఇలా అయిపోతే పెళ్లికి వడ్డానం పెట్టుకుంటే ఏమైపోతారో’ అంటూ వచ్చిన మీమ్‌కు కౌంటరిచ్చారు. ‘మన తెలుగు మీమర్లు చాలా ఫన్నీ. మన మహారాజులు & మొగలులు చోకర్లు(నెక్లెస్) ధరించేవారు. చోకర్లు మహిళలకే అనేది పాతకాలం. ఇది 2025.. మనం అలాంటి పరిమిత నమ్మకాల నుంచి బయటకు రావాలి’ అని ట్వీట్ చేశారు.

News November 10, 2025

డెబిట్ కార్డు ఉంటే చాలు.. మరణిస్తే రూ.10లక్షలు

image

చాలా బ్యాంకులు డెబిట్ కార్డులపై ఉచిత వ్యక్తిగత ప్రమాద బీమా అందిస్తాయి. కార్డు రకాన్ని బట్టి కవరేజ్ ₹10 లక్షలు, అంతకంటే ఎక్కువ కూడా ఉంటుంది. బ్యాంకును బట్టి రూల్స్ వేరుగా ఉన్నాయి. ఫీజును బట్టి కవరేజ్ ఉంది. కొన్ని బ్యాంకుల్లో ATM వాడితేనే అర్హులు. వ్యక్తి మరణిస్తే నామినీ బ్యాంకుకు వెళ్లి డెత్ సర్టిఫికెట్, FIR, పోస్ట్ మార్టం నివేదికతో దరఖాస్తు చేసుకోవాలి. మరింత సమాచారం కోసం బ్యాంకును సంప్రదించండి.