News November 21, 2024

‘గేమ్‌ఛేంజర్’.. దిమ్మ తిరిగి బొమ్మ కనబడింది: SJ సూర్య

image

‘గేమ్ ఛేంజర్’ అవుట్‌పుట్ అద్భుతంగా ఉందని నటుడు SJ సూర్య ట్విటర్లో కొనియాడారు. ‘హాయ్ ఫ్రెండ్స్. కీలక సన్నివేశాలకు సంబంధించి రామ్ చరణ్, శ్రీకాంత్‌తో డబ్బింగ్ పూర్తి చేశాను. 2 సీన్లకే 3రోజులు పట్టింది. అవుట్‌పుట్ చూస్తే దిమ్మతిరిగి బొమ్మ కనబడింది. థియేటర్లలో ఫ్యాన్స్ పిచ్చిపిచ్చిగా రెచ్చిపోతారు. ఈ అవకాశమిచ్చిన శంకర్, దిల్ రాజు‌, వారి బృందాలకు థాంక్స్. సంక్రాంతి మామూలుగా ఉండదు’ అని ట్వీట్ చేశారు.

Similar News

News November 21, 2024

‘నో లీవ్స్.. జ్వరమొచ్చినా రావాల్సిందే’.. ఆఫీస్ నోటీస్ వైరల్

image

డిసెంబర్‌ను విదేశాల్లో వెకేషన్ మంత్‌గా పరిగణిస్తుంటారు. అక్కడివారందరూ సుదీర్ఘ సెలవులో టూర్‌లకు వెళ్తుంటారు. దీంతో ఇండియా నుంచి వారికి పనిచేసే కంపెనీలు బిజీ అయిపోనున్నాయి. ఈ నేపథ్యంలో ఓ కంపెనీకి చెందిన నోటీస్ వైరలవుతోంది. ‘అత్యంత బిజీగా ఉండే రోజులు కాబట్టి ఈనెల 25 నుంచి డిసెంబర్ 31వరకు సెలవులుండవు. లీవ్స్ బ్లాక్ చేశాం. అనారోగ్యంగా ఉన్నా మినహాయింపులు ఉండవు’ అని సదరు కంపెనీలో నోటీసు అంటించారు.

News November 21, 2024

సెహ్వాగ్ కొడుకు డబుల్ సెంచరీ

image

IND మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తరహాలోనే కొడుకు ఆర్యవీర్ సెహ్వాగ్ అదరగొడుతున్నారు. కూచ్ బెహార్ ట్రోఫీలో భాగంగా మేఘాలయతో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ తరఫున అద్భుతమైన డబుల్ సెంచరీ చేశారు. 229 బంతుల్లోనే అజేయ ద్విశతకం బాదేశారు. ఇందులో 34 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. తొలి ఇన్నింగ్స్‌లో మేఘాలయ 260 పరుగులకు ఆలౌటైంది. ఆర్యవీర్ విజృంభణతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఢిల్లీ 468/2 స్కోర్ చేసింది.

News November 21, 2024

ఏంటీ.. అరటిపండు ఆర్ట్‌కు రూ.52 కోట్లా?

image

ఇది కూడా ఓ ఆర్టేనా? అనుకున్నవి కూడా రూ.కోట్ల ధరలు పలుకుతుంటాయి. తాజాగా న్యూయార్క్‌లో జరిగిన వేలంలో గోడకు టేపుతో అంటించిన ఓ కళాఖండాన్ని క్రిప్టోకరెన్సీ ఎంట్రపెన్యూర్ జస్టిన్ సన్ ఏకంగా $6.2 మిలియన్లకు(రూ.52కోట్లు) కొనుగోలు చేశారు. దీంతో అత్యంత ఖరీదైన అరటిపండుగా ఇది రికార్డులకెక్కింది. హాస్యనటుడు మౌరిజియో కాటెలాన్ దీనిని రూపొందించారు. అరటిపండు కుళ్లిపోతే ఎలా మార్చాలో కూడా ఆయన చెప్పారు.