News November 21, 2024

‘గేమ్‌ఛేంజర్’.. దిమ్మ తిరిగి బొమ్మ కనబడింది: SJ సూర్య

image

‘గేమ్ ఛేంజర్’ అవుట్‌పుట్ అద్భుతంగా ఉందని నటుడు SJ సూర్య ట్విటర్లో కొనియాడారు. ‘హాయ్ ఫ్రెండ్స్. కీలక సన్నివేశాలకు సంబంధించి రామ్ చరణ్, శ్రీకాంత్‌తో డబ్బింగ్ పూర్తి చేశాను. 2 సీన్లకే 3రోజులు పట్టింది. అవుట్‌పుట్ చూస్తే దిమ్మతిరిగి బొమ్మ కనబడింది. థియేటర్లలో ఫ్యాన్స్ పిచ్చిపిచ్చిగా రెచ్చిపోతారు. ఈ అవకాశమిచ్చిన శంకర్, దిల్ రాజు‌, వారి బృందాలకు థాంక్స్. సంక్రాంతి మామూలుగా ఉండదు’ అని ట్వీట్ చేశారు.

Similar News

News April 18, 2026

దిలావర్పూర్: అద్భుతం.. పెరుగుతున్న నంది

image

దిలావర్పూర్ మండలంలోని కదిలి పాపాహరేశ్వర ఆలయం పురాణ ప్రాశస్త్యం పొందింది. మాతృహత్య దోష నివారణకు పరశురాముడు ఇక్కడ లింగాలను ప్రతిష్ఠించగా, అవి కదిలినందున ‘కదిలే’ అనే పేరు వచ్చినట్లు పురాణ గాథ. ప్రకృతి ఒడిలో వెలసిన ఈ క్షేత్రంలోని నంది విగ్రహం ఏటా పెరుగుతుండటం విశేషం. సంతాన ప్రాప్తికి, అత్తాకోడళ్ల మధ్య సఖ్యతకు ఈ ఆలయం ప్రసిద్ధి చెంది భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతోంది.

News April 18, 2026

రేపే ఎగ్జామ్.. సీటొస్తే ఫ్యూచర్ సెట్

image

TGలోని 194 మోడల్ స్కూళ్లలో 6వ తరగతి, 7-10 తరగతుల్లో ఖాళీ సీట్ల ప్రవేశాలకు రేపు పరీక్ష జరగనుంది. ఆరో తరగతిలో ప్రవేశానికి 23వేలకు పైగా, మిగతా క్లాసులకు 37వేల మందికి పైగా విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షలో మెరిట్ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. ఇంగ్లిష్ మీడియంలో బోధన, బాలికలకు భోజనం, హాస్టల్ సదుపాయం ఉంటుంది. IIT, JEE, నీట్, ఎంసెట్, CA, TPT తదితర పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇస్తారు.

News April 18, 2026

‘హార్ముజ్’ ఓపెన్.. ఇరాన్ 3 షరతులివే!

image

‘హార్ముజ్’ను ఓపెన్ చేసిన నేపథ్యంలో ఇరాన్ 3 కండిషన్స్ పెట్టినట్లు ఆ దేశ మీడియా వెల్లడించింది.
☛ జలసంధి గుండా కమర్షియల్ నౌకలకే అనుమతి ఉంటుంది. మిలిటరీ నౌకలకు ప్రవేశం లేదు.
☛ ఇరాన్ నిర్దేశించిన మార్గంలోనే షిప్స్ వెళ్లాలి.
☛ ఇరాన్ మిలిటరీతో కోఆర్డినేట్ చేసుకున్న తర్వాతే రాకపోకలు జరగాలి.