News January 11, 2025

గేమ్‌ఛేంజర్: తైవాన్ బేఫికర్.. చైనాకు టెన్షన్!

image

పక్కలో బల్లెంగా మారిన చైనాకు తైవాన్ చుక్కలు చూపించే రోజు వచ్చేసింది! తన సరికొత్త Qingtian హైపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్‌ను ఆవిష్కరించింది. ఇది మాక్ 6 స్పీడ్‌తో 2000KM ప్రయాణించి దాడిచేయగలదు. చైనా సిటీస్, మిలిటరీ బేస్‌లను టార్గెట్ చేయగలదు. దీనిని కూల్చేయడం ఈజీ కాదు. 2024 ఆఖర్లో తైవాన్ వీటి మాస్ ప్రొడక్షన్‌ను ఆరంభించింది. ఈ టెక్నాలజీ అందించేందుకు రష్యాతో పాటు ఓ మిత్రదేశం సాయం చేసినట్టు సమాచారం.

Similar News

News February 8, 2026

తిరుపతి: మంచు విష్ణుకు నోటీసులు

image

తిరుపతిలో విద్యార్థి సంఘం నేతల కిడ్నాప్ వ్యవహారంలో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ ఘటనలో A-1 సతీశ్, A-2 మోహన్ బాబు, A-3గా విష్ణుపై తిరుచానూరు పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఈ నెల 5న పోలీసులు విష్ణుకు నోటీసులు అందజేశారు. ఈ నెల 15 తరువాత ఆయన విచారణకు వచ్చే అవకాశం ఉంది. కాగా ఇది వరకే ఈ కేసు కొట్టివేయాలంటూ మోహన్ బాబు హై కోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.

News February 8, 2026

క్వాంటం కంప్యూటింగ్ అంటే ఏంటీ?

image

AP: అమరావతిలో క్వాంటం వ్యాలీకి నిన్న <<19077394>>శంకుస్థాపన<<>> పడిన వేళ క్వాంటం కంప్యూటింగ్ అంటే ఏమిటి అనే చర్చ మొదలయింది. ఇది సంప్రదాయ కంప్యూటర్లకు మించిన శక్తిమంతమైనవి. ఇప్పటి కంప్యూటర్లు 0, 1 బిట్లపై పనిచేస్తే, క్వాంటం కంప్యూటర్లు క్యూబిట్స్‌పై ఆధారపడతాయి. క్యూబిట్ ఒకేసారి 0, 1గా ఉండగలగడం వల్ల అత్యంత వేగంగా పనిచేస్తాయి. మామూలు కంప్యూటర్లు కొన్ని ఏళ్లు చేసే పనిని ఇవి సెకన్లలోనే చేస్తాయి.

News February 8, 2026

క్వాంటం వ్యాలీతో నిరుద్యోగులకు లాభం ఏంటి?

image

AP: క్వాంటం వ్యాలీ ద్వారా నిరుద్యోగులకు కొత్త అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ ప్రాజెక్టుతో దాదాపు లక్ష ఉద్యోగాలు వస్తాయని భావిస్తోంది. యువతకు క్వాంటం టెక్నాలజీలో ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాలకు సిద్ధం చేస్తామని చెప్తోంది. IITలు, గ్లోబల్ కంపెనీల భాగస్వామ్యంతో స్కిల్ డెవలప్‌మెంట్ సాగనుందని, విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా అమరావతే టెక్ కెరీర్ కేంద్రంగా మారనుందని తెలిపింది.