News January 11, 2025
గేమ్‌ఛేంజర్: తైవాన్ బేఫికర్.. చైనాకు టెన్షన్!
పక్కలో బల్లెంగా మారిన చైనాకు తైవాన్ చుక్కలు చూపించే రోజు వచ్చేసింది! తన సరికొత్త Qingtian హైపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్‌ను ఆవిష్కరించింది. ఇది మాక్ 6 స్పీడ్‌తో 2000KM ప్రయాణించి దాడిచేయగలదు. చైనా సిటీస్, మిలిటరీ బేస్‌లను టార్గెట్ చేయగలదు. దీనిని కూల్చేయడం ఈజీ కాదు. 2024 ఆఖర్లో తైవాన్ వీటి మాస్ ప్రొడక్షన్‌ను ఆరంభించింది. ఈ టెక్నాలజీ అందించేందుకు రష్యాతో పాటు ఓ మిత్రదేశం సాయం చేసినట్టు సమాచారం.
Similar News
News January 16, 2025
నేటి నుంచి సీఎం రేవంత్ విదేశీ పర్యటన
TG: సీఎం రేవంత్ రెడ్డి నేటి నుంచి 8 రోజుల పాటు విదేశాల్లో పర్యటించనున్నారు. ఇవాళ సింగపూర్ వెళ్లనున్న ఆయన అంతర్జాతీయ సౌకర్యాలతో ఏర్పాటైన స్పోర్ట్స్ యూనివర్సిటీలు, స్టేడియాలను పరిశీలించనున్నారు. పారిశ్రామికవేత్తలతోనూ భేటీ కానున్నారు. ఈ నెల 20న స్విట్జర్లాండ్ వెళ్లి దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకానమిక్ ఫోరమ్‌లో పాల్గొంటారు. రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా ఆయన పలువురితో ఒప్పందాలు చేసుకోనున్నారు.
News January 16, 2025
3 రోజులు జాగ్రత్త
TGలో చలి తీవ్రత మరో మూడు రోజులు కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. తూర్పు, ఆగ్నేయం నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. పొగమంచు ప్రభావం ఉంటుందని తెలిపింది. ప్రయాణాలు చేసే వారు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో APలోని చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో 3 రోజులపాటు మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.
News January 16, 2025
విషాదం.. ప్రకృతి వైపరీత్యాలకు 3,200 మందికి పైగా మృతి
దేశంలో ప్రకృతి వైపరీత్యాల కారణంగా 3,200 మందికిపైగా మరణించినట్లు వాతావరణ వార్షిక నివేదిక-2024 పేర్కొంది. అత్యధికంగా 1,374 మంది పిడుగుపాటుకు గురై మరణించగా, వరదల వల్ల 1,287 మంది, వడదెబ్బ కారణంగా 459 మంది చనిపోయారని వెల్లడించింది. వరదలతో అత్యధికంగా కేరళలో, పిడుగుపాటుతో బిహార్‌లో మరణాలు చోటు చేసుకున్నట్లు పేర్కొంది. మరోవైపు గత ఏడాది అత్యధిక ఉష్ణ సంవత్సరంగా నిలిచింది.