News April 11, 2025
గంధమల్ల రిజర్వాయర్ సామర్థ్యం కుదింపు

TG: యాదాద్రి(D) గంధమల్ల రిజర్వాయర్ సామర్థ్యాన్ని 4.28 TMCల నుంచి 1.41 TMCలకు తగ్గిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రూ.575.56 కోట్లతో అనుమతులు మంజూరు చేసింది. కాళేశ్వరం ప్రాజెక్ట్లో భాగంగా అప్పటి BRS ప్రభుత్వం గంధమల్ల వద్ద 9.86 TMCలతో రిజర్వాయర్ నిర్మించాలనుకుంది. ముంపునకు గురయ్యే 5 గ్రామాల నుంచి వ్యతిరేకత రావడంతో 4.28 TMCలకు కుదించింది. తాజాగా INC సర్కార్ 1.41 TMCలకు పరిమితం చేసింది.
Similar News
News October 13, 2025
సాయంకాలం ఇంటి తలుపులు మూసేస్తున్నారా?

పురాణాల ప్రకారం.. సాయంత్రం వేళ జ్యేష్ఠాదేవి వెనుక ద్వారం నుంచి, మహాలక్ష్మి సింహద్వారం నుంచి ఇంట్లోకి ప్రవేశిస్తారు. అందుకే సంధ్యా సమయానికి ముందే ఇల్లు శుభ్రం చేసి, లక్ష్మీదేవి ఆగమనాన్ని ఆహ్వానించాలి. జ్యేష్ఠాదేవి రాకుండా, వెనుక వైపు తలుపులను మూసి, ప్రధాన ద్వారాన్ని తెరిచి ఉంచాలి. ఫలితంగా అమ్మవారి కటాక్షం లభిస్తుంది.
☛ మరిన్ని ధర్మ సందేహాల నివృత్తి కోసం <<-se_10013>>భక్తి<<>> కేటగిరీకి వెళ్లండి.
News October 13, 2025
ఇండియన్ ఆర్మీ DG EMEలో 69 పోస్టులు

ఇండియన్ ఆర్మీ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజినీర్స్( DG EME)69 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు నవంబర్ 15వరకు అప్లై చేసుకోవచ్చు. జూనియర్ టెక్నికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్, స్టెనోగ్రాఫర్, LDC, MTS, దోబీ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి టెన్త్, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వెబ్సైట్: https://www.indianarmy.nic.in.
News October 13, 2025
ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ

ఢిల్లీలో ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. విశాఖలో పెట్టుబడుల సదస్సుకు రావాలని ఆయన్ను ఆహ్వానించారు. చంద్రబాబు వెంట కేంద్రమంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఉన్నారు.