News August 22, 2025
కరెన్సీ నోట్లపై గాంధీని బాగానే గుర్తుపడతారు: HC

TG: ఇటీవల HYDలో జరిగిన విద్యుత్ ప్రమాదంపై ఎవరికి వారు చేతులు దులుపుకుంటే ఎలా అని HC జడ్జి జస్టిస్ నగేశ్ ప్రశ్నించారు. స్తంభాలపై అన్ని వైర్లు నల్లగా ఉన్నందున గుర్తుపట్టలేకపోయామన్న <<17483930>>పిటిషనర్ వాదన<<>>కు.. కరెన్సీ నోట్లపై ఉన్న గాంధీని బాగానే గుర్తుపడతారని చురకలంటించారు. మామూళ్లతో కొందరు ఉద్యోగుల జేబులు బరువెక్కుతున్నాయన్నారు. ఒకరినొకరు నిందించుకోవడం ఆపి ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలని సూచించారు.
Similar News
News August 22, 2025
ముగిసిన నామినేషన్ల పరిశీలన.. బరిలో ఇద్దరే!

ఉపరాష్ట్రపతి ఎన్నికలో నామినేషన్ల పరిశీలన ముగిసింది. పలువురు దాఖలు చేసిన నామినేషన్లను స్క్రూటినీ చేశారు. అనంతరం ఎన్డీఏ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్, ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి ఇద్దరే బరిలో నిలిచినట్లు అధికారులు ప్రకటించారు. ఉపరాష్ట్రపతి ఎన్నిక సెప్టెంబర్ 9న జరగనుంది. ఎన్టీఏ కూటమికే అత్యధిక మంది ఎంపీలు ఉండటంతో రాధాకృష్ణన్ గెలుపు లాంఛనం కానుంది.
News August 22, 2025
సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా మళ్లీ కూనంనేని

TG: సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా కూనంనేని సాంబశివరావు మరోసారి ఎన్నికయ్యారు. HYD గాజులరామారంలో జరిగిన సీపీఐ 4వ రాష్ట్ర మహాసభల్లో ఆయన పేరును పార్టీ నేత వెంకట్‌రెడ్డి ప్రతిపాదించగా, మరో నేత శంకర్ బలపరిచారు. మూడేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. సాంబశివరావు ప్రస్తుతం కొత్తగూడెం MLAగా ఉన్నారు.
News August 22, 2025
జపాన్, చైనా పర్యటనకు మోదీ

జపాన్, చైనా దేశాల్లో ప్రధాని మోదీ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఆగస్టు 29, 30 తేదీల్లో జపాన్‌లో పర్యటించనున్న ఆయన 15వ ఇండియా-జపాన్ సమ్మిట్‌లో పాల్గొంటారు. అటు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఆహ్వానం మేరకు ఆగస్టు 31, సెప్టెంబర్ 1 తేదీల్లో చైనాలో పర్యటించనున్నారు. షాంఘై సహకార సదస్సు(SCO)లో మోదీ పాల్గొంటారు. ప్రస్తుతం భారత్-అమెరికా సంబంధాలు అంతంత మాత్రంగా ఉండగా, చైనా పర్యటనకు మోదీ వెళ్లడం ఆసక్తిగా మారింది.