News January 31, 2025
కాశీలో ‘గంగా హారతి’ నిలిపివేత

ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళాకు వెళ్తున్న భక్తులు అట్నుంచి కాశీ విశ్వనాథ ఆలయాన్నీ కవర్ చేస్తున్నారు. దీంతో వారణాసిలో రద్దీ నెలకొనగా ప్రతి రోజు సాయంత్రం ఘాట్ల వద్ద నిర్వహించే ‘గంగా హారతి’ని నిలిపేస్తూ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరి 5 వరకు ఈ కార్యక్రమాన్ని నిలిపేస్తున్నట్లు, భక్తులు ఆయా ఘాట్ల వద్దకు రావొద్దన్నారు. రద్దీ నేపథ్యంలో కాశీ ప్రజలు అవసరం అయితేనే బయటకు రావాలని సూచించారు.
Similar News
News February 9, 2025
సీట్ల తేడా ఎక్కువున్నా ఓట్ల వ్యత్యాసం తక్కువే!

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో BJP, AAP మధ్య ఓట్ల తేడా 2% కంటే తక్కువే ఉంది. BJPకి 45.56% పోలవగా ఆప్‌కు 43.57% వచ్చాయి. కానీ సీట్ల తేడా మాత్రం 26 స్థానాలుగా ఉంది. కాషాయ పార్టీ 48 స్థానాలను గెలుచుకోగా ఆప్ 22 సీట్లకే పరిమితమైంది. అత్యధిక మెజార్టీతో గెలిచిన తొలి ముగ్గురు అభ్యర్థులూ ‘చీపురు’ పార్టీకి చెందినవారే కాగా అత్యల్ప మెజార్టీతో విజయం సాధించిన చివరి ముగ్గురూ కమలం అభ్యర్థులే కావడం గమనార్హం.
News February 9, 2025
రోహిత్ ఫామ్‌పై ఆందోళన లేదు: బ్యాటింగ్ కోచ్

టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్ గురించి తమకు ఆందోళన లేదని బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ తెలిపారు. ‘రోహిత్‌కు వన్డేల్లో 31 సెంచరీలున్నాయి. గత వన్డే సిరీస్‌లో(vsSL) 56, 64, 35 పరుగులు చేశాడు. టెస్టుల్లో విఫలమయ్యాడు కానీ వన్డేల్లో రన్స్ చేస్తూనే ఉన్నాడు. అతడి బ్యాటింగ్‌తో మాకు ఏ సమస్యా లేదు’ అని ప్రెస్ కాన్ఫరెన్స్‌లో స్పష్టం చేశారు.
News February 9, 2025
మహారాష్ట్రలో పెరుగుతున్న GBS కేసులు

మహారాష్ట్రలో తాజాగా మరో 3 <<15225307>>గిలియన్ బార్ సిండ్రోమ్<<>> కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు సంఖ్య 183కు చేరింది. 6 మరణాలు సంభవించాయి. ఇప్పటివరకు 151 మంది కోలుకున్నారు. ఇటీవల ముంబైలోనూ GBS తొలి కేసు నమోదైంది. 64 ఏళ్ల వృద్ధురాలికి ఈ వ్యాధి ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. అంధేరి తూర్పు ప్రాంతంలో నివసించే ఆ మహిళకు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.