News June 24, 2024

KCRతో గంగుల భేటీ.. పార్టీ మార్పు ప్రచారానికి చెక్?

image

TG: కరీంనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కాంగ్రెస్‌లో చేరనున్నట్లు వార్తలు వస్తున్న వేళ కీలక పరిణామం జరిగింది. నిన్న KCRతో గంగుల, 29 మంది కార్పొరేటర్లు భేటీ అయ్యారు. కరీంనగర్ జిల్లాలో బలమైన నేతగా ఉన్న కమలాకర్ BRSను వీడితే పార్టీకి నష్టమని భావించి కేసీఆరే.. ఆయన్ను ఫామ్‌హౌస్‌కు ఆహ్వానించినట్లు సమాచారం. భవిష్యత్ అంతా BRSదేనని, ఎవరూ పార్టీ మారొద్దని గులాబీ దళపతి సూచించినట్లు తెలుస్తోంది.

Similar News

News January 10, 2025

ఉద్యోగులమా? లేక కాడెద్దులమా?

image

ఒత్తిడి పెరిగి ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు పెరుగుతున్నా యజమానుల తీరు మారట్లేదు. ఉద్యోగుల ఆరోగ్యాన్ని వారు పట్టించుకోవట్లేదని విమర్శలొస్తున్నాయి. తాజాగా L&T ఛైర్మ‌న్ సుబ్ర‌హ్మ‌ణ్య‌న్ 90 గంటలు పని వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. కాడెద్దుల్లా పనిచేయాలన్నట్లు వారు ప్రవర్తిస్తున్నారని నెటిజన్లు మండిపడుతున్నారు. వ్యక్తిగత జీవితాన్ని పక్కనపెట్టి ఉద్యోగం చేస్తున్నా గుర్తింపులేదని వాపోతున్నారు.

News January 10, 2025

నేడు TTD ధర్మకర్తల మండలి అత్యవసర భేటీ

image

AP: తిరుమలలో ఇవాళ సా.4 గంటలకు TTD ధర్మకర్తల మండలి అత్యవసర సమావేశం కానుంది. తిరుపతి తొక్కిసలాట మృతుల కుటుంబాలకు పరిహారంపై ఇందులో తీర్మానించనున్నట్లు సమాచారం. సాయంత్రానికి చెక్కులు తయారు చేసి, రేపు ఉదయానికల్లా ముగ్గురు టీటీడీ బోర్డు సభ్యుల బృందం మృతుల గ్రామాలకే వెళ్లి వాటిని అందజేసే అంశంపైనా చర్చించనున్నారు. తొక్కిసలాటలో ఆరుగురు చనిపోగా రూ.25లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన విషయం తెలిసిందే.

News January 10, 2025

OTTలోకి వచ్చేసిన కొత్త సినిమా

image

అల్లరి నరేశ్ నటించిన ‘బచ్చలమల్లి’ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చింది. ఇవాళ్టి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. సుబ్బు మంగదేవి డైరెక్ట్ చేసిన ఈ మూవీ గత నెల 20న థియేటర్లలో విడుదలై మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. నరేశ్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇందులో అమృత అయ్యర్ హీరోయిన్‌గా నటించగా, విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు.