News February 21, 2025
గంగూలీకి తప్పిన ప్రమాదం

భారత మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీకి అదృష్టవశాత్తూ ప్రమాదం తప్పింది. ప.బెంగాల్‌లోని దంతన్పూర్ వద్ద ఓ లారీ ఆయన కాన్వాయ్‌ను ఓవర్‌టేక్ చేయడంతో డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేకులు వేయాల్సి వచ్చింది. దీంతో గంగూలీ వాహనానికి వెనక ఉన్న కార్లన్నీ ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో రెండు కార్లు దెబ్బతినగా, దాదా సహా ఎవరికీ గాయాలు కాలేదు. ఓ ఈవెంట్ కోసం బుర్ద్వాన్ వర్సిటీకి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.
Similar News
News March 19, 2025
పలు పదవులకు SEC నోటిఫికేషన్

AP: మండల ప్రజా పరిషత్, 2 జిల్లా పరిషత్‌లు, పంచాయతీల్లో ఖాళీలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో గ్రామ పంచాయతీల్లో 214 ఉప సర్పంచ్‌లు, వైఎస్సార్ ZP ఛైర్‌పర్సన్, కర్నూలు ZP కోఆప్టెడ్ మెంబర్, MPPలలో 28 ప్రెసిడెంట్స్, 23 వైస్ ప్రెసిడెంట్స్, 12 కోఆప్టెడ్ మెంబర్ ఖాళీలున్నాయి. ఈ నెల 23లోగా సంబంధిత మెంబర్లకు నోటీసులు జారీ చేస్తామని, 27న ఎన్నిక నిర్వహిస్తామని SEC తెలిపింది.
News March 19, 2025
నాకు రక్షణ కల్పించండి: వివేకా హత్య కేసు నిందితుడు

AP: వివేకా హత్య కేసు నిందితుడు సునీల్ యాదవ్ కడప SPని కలిసి తనకు ప్రాణహాని ఉందని, భద్రత కల్పించాలని కోరారు. అనంతరం మాట్లాడుతూ.. ‘‘ఈ హత్య కేసులో నిందితులు జైల్లో నన్ను బెదిరించారు. నేను మాట్లాడే విషయాలు కొందరికి నచ్చట్లేదు. వైసీపీకి చెందిన కొందరు నన్ను బెదిరిస్తున్నారు. ‘హత్య’ సినిమాలో నన్ను క్రూరంగా చిత్రీకరించారు. ఆ మూవీలో నలుగురే చంపినట్లు చూపించారు. 8మందిని ఎందుకు చూపించలేదు?’’ అని ప్రశ్నించారు.
News March 19, 2025
రేవంత్‌పై నమోదైన కేసు కొట్టివేత

TG: గత ప్రభుత్వ హయాంలో రేవంత్ రెడ్డిపై నమోదైన కేసును హైకోర్టు తాజాగా కొట్టివేసింది. 2020 మార్చిలో జన్వాడలో డ్రోన్ ఎగురవేశారని రేవంత్‌తో సహా పలువురిపై రంగారెడ్డి జిల్లాలోని నార్సింగి పీఎస్‌లో కేసు నమోదైంది. అలాగే రేవంత్‌ను కించపరిచే విధంగా మాట్లాడారని సైఫాబాద్ పీఎస్‌లో కేటీఆర్‌పై నమోదైన కేసును కూడా హైకోర్టు కొట్టివేసింది.