News November 10, 2024
చెత్త తెచ్చిన ఆదాయం రూ.650 కోట్లు
అక్టోబర్ 2 నుంచి 31 వరకు కేంద్రం చేపట్టిన ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమం 4.Oకు మంచి స్పందన లభించింది. దేశవ్యాప్తంగా 5.97 లక్షల ప్రభుత్వ కార్యాలయాల్లోని చెత్తను తొలగించడం ద్వారా రూ.650 కోట్ల ఆదాయం వచ్చింది. కొత్తగా 190 లక్షల చదరపు అడుగుల స్థలం అందుబాటులోకి వచ్చిందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. 2021-24 మధ్య చెత్త అమ్మకం ద్వారా రూ.2,364 కోట్ల ఆదాయం లభించింది.
Similar News
News December 8, 2024
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు
అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో అర్ధరాత్రి నుంచి వర్షం కురిసింది. TGలో నేడు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈనెల 10 నుంచి పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. ఏపీలో విశాఖ, అనకాపల్లి, కాకినాడ తదితర జిల్లాల్లో వానలు కురుస్తున్నాయి.
News December 8, 2024
ఏప్రిల్ నుంచి రాజమౌళి-మహేశ్ సినిమా షురూ?
రాజమౌళి- మహేశ్ బాబు కాంబినేషన్‌లో మూవీ పట్టాలెక్కడం మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం లొకేషన్లు, నటీనటుల ఎంపికలో దర్శకధీరుడు బిజీగా ఉన్నారు. ఏప్రిల్ మూడో వారం తర్వాత రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని సమాచారం. అడ్వెంచరస్ థ్రిల్లర్‌గా రూపొందనున్న ఈ చిత్రంలో ఇండోనేషియన్ బ్యూటీ చెల్సియా ఇస్లాన్ హీరోయిన్‌గా ఎంపికైనట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.
News December 8, 2024
AUSvsIND: టీమ్ ఇండియా అమ్మాయిల లక్ష్యం 372
ఆస్ట్రేలియాలో భారత్, ఆసీస్ అమ్మాయిల మధ్య జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో టీమ్ ఇండియా బౌలర్లు తేలిపోయారు. జార్జియా వోల్(101), ఎలీస్ పెర్రీ(105) సెంచరీలు, లిచ్‌ఫీల్డ్(60), బెత్ మూనీ(56) హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో 50 ఓవర్లలో ఆసీస్ టీమ్ 371/8 స్కోర్ చేసింది. భారత బౌలర్లలో సైమా 3 వికెట్లు, మిన్ను 2, రేణుక, దీప్తి శర్మ, ప్రియా మిశ్రా తలో వికెట్ తీశారు.