News April 29, 2024

చెత్త పన్ను రద్దు చేస్తా: చంద్రబాబు

image

AP: ఢిల్లీ లిక్కర్ స్కాం కంటే.. మన రాష్ట్రంలో జరుగుతున్న లిక్కర్ స్కాం పెద్దదని చంద్రబాబు ఆరోపించారు. ‘వైసీపీ నేతలు దోచుకున్న డబ్బు కక్కిస్తా. నేనొస్తే కరెంట్ కోతలుండవు, ఛార్జీలు పెరగవు. చెత్త పన్ను రద్దు చేస్తా. జగన్ మళ్లీ వస్తే జుట్టు, గాలి మీద కూడా పన్ను వేస్తాడు. యువతకు ఏటా 4లక్షల ఉద్యోగాలిచ్చే బాధ్యత నాది. సీపీఎస్ సమస్య పరిష్కారం కోసం కొత్త విధానం తీసుకొస్తా’ అని డోన్ సభలో హామీలిచ్చారు.

Similar News

News November 6, 2024

ట్రంప్ గెలుపు: రష్యాకు కాదు ఉక్రెయిన్‌కే షాక్

image

డొనాల్డ్ ట్రంప్ విజయం ఉక్రెయిన్‌పై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. తాను యుద్ధాలు చేసేందుకు కాదు ఆపేందుకు వచ్చానని గెలుపు స్పీచ్‌లోనే ట్రంప్ స్పష్టం చేశారు. పైగా నాటోపై ఖర్చుచేయడం దండగని గతంలో చాలాసార్లు చెప్పారు. రష్యాతో యుద్ధం మొదలయ్యాక మిలిటరీ సాయం కింద ఉక్రెయిన్‌కు అమెరికా $64 బిలియన్లు సాయం చేసింది. ఇకపై దీనిని ఆపేయొచ్చు. మునుపటి స్థాయిలో నైతిక మద్దతు ఇవ్వకపోవచ్చు.

News November 6, 2024

RCBకే మళ్లీ ఆడతానేమో: మ్యాక్స్‌వెల్

image

రిటెన్షన్ల ప్రక్రియ చేపట్టేముందు RCB తనను సంప్రదించిందని ఆసీస్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ తెలిపారు. రిటైన్ చేసుకోవటం లేదని, తమను అర్థం చేసుకోవాలని కోరినట్లు చెప్పారు. ‘అరగంటపాటు నాతో ఆండీ ఫ్లవర్, మో బోబాట్ జూమ్ కాల్‌లో మాట్లాడారు. రిటైన్ చేసుకోకపోవడానికి కారణం చెప్పారు. అదో గొప్ప ఫ్రాంచైజీ. మళ్లీ ఆ జట్టులోకి వెళ్తానేమో. RCBతో నా ప్రయాణం ముగిసిందని చెప్పలేను’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు.

News November 6, 2024

3ఏళ్లలో అందుబాటులోకి మామునూర్ ఎయిర్‌పోర్టు: కోమటిరెడ్డి

image

TG: వరంగల్‌లోని మామునూరు ఎయిర్‌పోర్టును 3ఏళ్లలో అందుబాటులోకి తేవాలని మంత్రి కోమటిరెడ్డి అధికారులను ఆదేశించారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని నిర్మాణపనులు ఉండాలని సూచించారు. ఈమేరకు సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రతి 15రోజులకోసారి పనుల తీరుపై తాను సమీక్షిస్తానని చెప్పారు. ఎయిర్‌పోర్టును ఉడాన్ స్కీమ్‌తో అనుసంధానం చేసి పెద్ద పట్టణాలతో రాకపోకలకు అనువుగా మార్చాలన్నారు.