News July 13, 2024
ఫిబ్రవరిలో గేట్ పరీక్ష

దేశంలోని ఐఐటీలు, ఇతర సంస్థల్లో ఎంటెక్ ప్రవేశాలకు నిర్వహించే గేట్-2025 పరీక్షలు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్నాయి. 1, 2, 15, 16 తేదీల్లో ఆన్లైన్ విధానంలో జరిగే ఈ పరీక్షల నిర్వహణ బాధ్యతలను ఐఐటీ రూర్కీ చేపట్టింది. మొత్తం 30 సబ్జెక్టుల్లో ఎగ్జామ్స్ జరగనుండగా ఆగస్టు నెలాఖరులో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. గేట్ స్కోరు ద్వారా ఎంటెక్లో చేరితే నెలకు రూ.12,400 చొప్పున స్కాలర్షిప్ అందుతుంది.
Similar News
News November 22, 2025
విద్యార్థినుల కోసం కొత్త పథకం: మంత్రి లోకేశ్

AP: వచ్చే ఏడాది నుంచి ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థినులకు ‘కలలకు రెక్కలు’ పథకాన్ని అమలు చేస్తామని మంత్రి లోకేశ్ తెలిపారు. దీనిపై విధివిధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. ‘దేశవిదేశాల్లో ఉన్నత విద్య చదవాలనే విద్యార్థినులకు ఆర్థిక సాయం అందిస్తాం. ప్రస్తుతం విదేశాల్లో APకి చెందిన 27,112 మంది, స్వదేశంలో 88,196 మంది విద్యార్థినులు ఉన్నత చదువులు చదువుతున్నారు’ అని ట్వీట్ చేశారు.
News November 22, 2025
CSIR-NML 67 పోస్టులకు నోటిఫికేషన్

<
News November 22, 2025
ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉద్యోగాలు.. నేటి నుంచి దరఖాస్తులు

ఇంటెలిజెన్స్ బ్యూరో (IB)లో 362 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) పోస్టులకు నేటి నుంచి దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. టెన్త్ పాసై 18-25 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. జీతం నెలకు రూ.18,000-రూ.56,900. ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తులకు చివరి తేదీ డిసెంబర్ 14. హైదరాబాద్ బ్యూరోలో 6, విజయవాడలో 3 ఖాళీలు ఉన్నాయి. అప్లై చేసేందుకు ఇక్కడ <


