News July 13, 2024

ఫిబ్రవరిలో గేట్ పరీక్ష

image

దేశంలోని ఐఐటీలు, ఇతర సంస్థల్లో ఎంటెక్ ప్రవేశాలకు నిర్వహించే గేట్-2025 పరీక్షలు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్నాయి. 1, 2, 15, 16 తేదీల్లో ఆన్‌లైన్ విధానంలో జరిగే ఈ పరీక్షల నిర్వహణ బాధ్యతలను ఐఐటీ రూర్కీ చేపట్టింది. మొత్తం 30 సబ్జెక్టుల్లో ఎగ్జామ్స్ జరగనుండగా ఆగస్టు నెలాఖరులో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. గేట్ స్కోరు ద్వారా ఎంటెక్‌లో చేరితే నెలకు రూ.12,400 చొప్పున స్కాలర్‌షిప్ అందుతుంది.

Similar News

News February 15, 2025

లోన్ కట్టలేదని గేటు ఊడదీసుకుపోవడం ఏంటి?: తుమ్మల

image

TG: లోన్ చెల్లించలేదని బ్యాంకు అధికారులు ఓ రైతు ఇంటి గేటు తీసుకెళ్లిన <<15446915>>ఘటనపై<<>> వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల స్పందించారు. అప్పులు చెల్లించని డిఫాల్టర్లకు బ్యాంకులు రూ.కోట్లతో రుణాలు ఇస్తున్నాయని, రైతులు సకాలంలో లోన్ కట్టకపోతే గేటు ఊడదీసుకుపోవడం ఏంటని ప్రశ్నించారు. మానవీయ కోణంలో వ్యవహరించాలని నాబార్డు రుణ ప్రణాళిక సదస్సులో ఆయన సూచించారు. అన్నదాతలకు రుణాలు ఇవ్వడంలోనూ నిర్లక్ష్యం తగదన్నారు.

News February 15, 2025

జయలలిత బంగారు ‘ఖజానా’!

image

మాజీ సీఎం జయలలిత ఆస్తులు, పత్రాలను తమిళనాడు ప్రభుత్వానికి బెంగళూరు కోర్టు అధికారులు అప్పగించారు. ఇందులో 27 కిలోల బంగారం, 1,116 కిలోల వెండి, రత్నాలు, వజ్రాభరణాలు, 10 వేల చీరలు, 750 జతల చెప్పులు, 1,672 ఎకరాల భూముల పత్రాలు, ఇళ్ల దస్తావేజులు, 8,376 పుస్తకాలు ఉన్నాయి. వీటన్నింటిని 6 ట్రంకు పెట్టెల్లో తీసుకువచ్చి అప్పగించారు. వీటి విలువ ప్రస్తుతం రూ.4,000 కోట్లుగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

News February 15, 2025

నేటి నుంచి CBSE 10, 12వ తరగతి ఎగ్జామ్స్

image

నేటి నుంచి దేశవ్యాప్తంగా CBSE బోర్డ్ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం 7842 సెంటర్లు ఏర్పాటు చేశారు. 24.12 లక్షల మంది 10వ, 17.88 లక్షల మంది 12వ తరగతి విద్యార్థులు ఈ పరీక్షలు రాయనున్నారు. ఉ.10.30 నుంచి మ.1.30 గం. వరకు ఎగ్జామ్స్ ఉంటాయి. అడ్మిట్ కార్డులతో పాటు స్కూల్ ఐడెంటిటీ కార్డులు తీసుకెళ్లాలి. యూనిఫాం తప్పనిసరి. మార్చి 18న టెన్త్, ఏప్రిల్ 4న 12వ తరగతి బోర్డ్ ఎగ్జామ్స్ ముగుస్తాయి.

error: Content is protected !!