News March 18, 2025

రేపు GATE ఫలితాల విడుదల

image

గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (GATE-2025) ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలలోపు రిజల్ట్స్ వెల్లడయ్యే అవకాశం ఉంది. gate2025.iitr.ac.in వెబ్‌సైట్‌లో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. మార్చి 28 నుంచి మే 31 వరకు స్కోర్ కార్డులు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. ఫిబ్రవరి 1, 2, 15, 16 తేదీల్లో ఈ పరీక్షను నిర్వహించిన సంగతి తెలిసిందే.

Similar News

News April 24, 2025

టెన్త్ ఫెయిలైన వారికి ALERT

image

AP: టెన్త్ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలకు ఇవాళ్టి నుంచి ఈ నెల 30 వరకు ఫీజు చెల్లించవచ్చు. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు మే 1 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రీకౌంటింగ్‌కు ఫీజు ఒక్కో సబ్జెక్టుకు రూ.500, రీ వెరిఫికేషన్‌కు రూ.1,000గా ఉంది. https://www.bse.ap.gov.in/ సైట్‌లో HM లాగిన్ ద్వారా ఫీజు చెల్లించవచ్చు. సప్లిమెంటరీ పరీక్షలు మే 19 నుంచి 28వ తేదీ వరకు జరుగుతాయి.

News April 24, 2025

మాజీ మంత్రి విడదల రజినీ మరిది అరెస్ట్

image

AP: వైసీపీ నేత, మాజీ మంత్రి విడదల రజినీ మరిది విడదల గోపీని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. యడ్లపాడు కంకర క్వారీ యజమానులను బెదిరించి డబ్బులు వసూలు చేశారని రజినీతో పాటు గోపీపై కేసు నమోదైంది. ఈక్రమంలోనే అతడిని హైదరాబాద్‌లో అరెస్ట్ చేసి విజయవాడకు తరలిస్తున్నారు.

News April 24, 2025

వారికి ఆ అవకాశం ఇవ్వొద్దు: పాలస్తీనా అధ్యక్షుడు

image

పాలస్తీనా అధ్యక్షుడు మహ్మద్ అబ్బాస్ హమాస్‌పై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ఆయుధాలను, ఇజ్రాయెల్ బందీలను విడిచిపెట్టాలని హుకుం జారీ చేశారు. ‘హమాస్ కుక్కల్లారా.. బందీలను వెంటనే విడిచిపెట్టండి. గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న నరమేధం ఆగాలి. బందీల కోసమంటూ ఆ దేశం నరకం సృష్టిస్తోంది. వారికి ఆ అవకాశం ఇవ్వొద్దు’ అని సూచించారు. కాగా హమాస్‌పై పాలస్తీనా నుంచి ఈ స్థాయిలో ఆగ్రహం వ్యక్తం కావడం ఇదే తొలిసారి.

error: Content is protected !!