News April 4, 2025
బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గౌతమ్ రావు

TG: హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిని బీజేపీ అధిష్ఠానం ఖరారు చేసింది. డా.ఎన్.గౌతమ్ రావును బరిలో నిలపాలని నిర్ణయించింది. సోషియాలజీలో డాక్టరేట్ పొందిన గౌతమ్ రావు విజ్ఞాన భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఛైర్మన్గా ఉన్నారు. గతంలో హైదరాబాద్ సెంట్రల్ జిల్లా బీజేపీ ప్రెసిడెంట్గా పనిచేశారు. ఈ ఎమ్మెల్సీ స్థానానికి ఏప్రిల్ 23న పోలింగ్ జరగనుండగా, 25న ఓట్ల లెక్కింపును చేపట్టనున్నారు.
Similar News
News April 10, 2025
కంచ గచ్చిబౌలిలో పర్యటిస్తున్న సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ

TG: కంచ గచ్చిబౌలి భూముల్లో సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ పర్యటిస్తోంది. స్థలాన్ని పరిశీలించి వాస్తవ పరిస్థితులపై అధ్యయనం చేయనుంది. అనంతరం ఆ నివేదికను సుప్రీంకోర్టుకు అందజేస్తుంది. దాన్నిబట్టి అత్యున్నత న్యాయస్థానం విచారణ కొనసాగించనుంది. ఆ భూములను వేలం వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించగా HCU విద్యార్థులతో పాటు సర్వత్రా నిరసనలు వ్యక్తం అయ్యాయి. చివరికి SC జోక్యంతో అభివృద్ధి పనులు నిలిచిపోయాయి.
News April 10, 2025
పోసాని క్వాష్ పిటిషన్పై నేడు విచారణ

AP: నటుడు పోసాని కృష్ణమురళి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై నేడు హైకోర్టు విచారణ చేపట్టనుంది. తనపై నెల్లూరు పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేశారని దానిని క్వాష్ చేయాలని కోరుతూ పోసాని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. Dy.CM పవన్ కళ్యాణ్తో పాటు పలువురిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని పోసానిపై కేసులు నమోదయ్యాయి. కొద్దిరోజుల క్రితమే ఆయన బెయిల్పై విడుదలైన సంగతి తెలిసిందే.
News April 10, 2025
ప్రముఖ హాలీవుడ్ నటుడు మృతి

ప్రముఖ హాలీవుడ్ నటుడు మెల్ నోవాక్(93) వృద్ధాప్య సమస్యలతో కన్నుమూశారు. గేమ్ ఆఫ్ డెత్లో బ్రూస్లీతో కలిసి విలన్గా నటించారు. ఐ ఫర్ యాన్ ఐ, బ్లాక్ బెల్ట్ జోన్స్ వంటి యాక్షన్ సినిమాల్లో నటించారు. 1974లో ట్రక్ టర్నర్లో నటించిన ఆయన చివరగా 2020లో ఎబోలా రెక్స్ వర్సెస్ మర్డర్ హార్నెట్స్ సినిమాలో కనిపించారు.