News November 12, 2024

శాంసన్‌పై ప్రశ్నకు మనసులు గెలిచేలా గౌతీ జవాబు

image

సంజూ శాంసన్ వరుస సెంచరీల వెనక తన ఘనతేమీ లేదని టీమ్ఇండియా కోచ్ గౌతమ్ గంభీర్ అన్నారు. అదంతా అతడి ప్రతిభేనని ప్రశంసించారు. ‘సంజూ ఫామ్‌ కోసం నేను చేసిందేమీ లేదు. అతడు సమర్థుడు. మనం చేయాల్సిందల్లా అతడిని సరైన స్థానంలో క్రీజులోకి పంపించి ఎంకరేజ్ చేయడమే. సంజూ చాలా శ్రమిస్తారు. ఇది అంతం కాదు ఆరంభం. భారత్ కోసం అతడిలాగే ఆడాలని కోరుకుంటున్నా. ప్రెజర్లోనూ యువ ఆటగాళ్లు రాణించడం శుభసూచకం’ అని పేర్కొన్నారు.

Similar News

News December 6, 2025

నిఘాలో తూర్పు గోదావరి

image

తూర్పుగోదావరి జిల్లా పరిధిలో 5 వేల సీసీ కెమెరాలు, 17 డ్రోన్ కెమెరాలతో నిరంతర నిఘా ఏర్పాటు చేయడం ద్వారా నేరాలను అదుపు చేయగలిగామని ఎస్పీ డి.నరసింహ కిషోర్ తెలిపారు. గత 11 నెలల కాలంలో 1137 డ్రంక్ అండ్ డ్రైవ్, 399 పేకాట, 242 కోడి పందేలు, 126 సారా, 49 గంజాయి కేసులు నమోదు చేశామన్నారు. అదృశ్యమైన 136 మంది బాలికల్లో 133 మందిని గుర్తించామని ఎస్పీ పేర్కొన్నారు.

News December 6, 2025

NCCDలో ఉద్యోగాలు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

image

నేషనల్ సెంటర్ ఫర్ కోల్డ్‌చైన్ డెవలప్‌మెంట్‌లో 5 పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. అర్హతగల అభ్యర్థులు contact-nccd@gov.in ఈ మెయిల్ ద్వారా అప్లై చేసుకోవాలి. పోస్టును బట్టి బీఈ, బీటెక్, పీజీ(అగ్రి బిజినెస్), ఎంకామ్, సీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: nccd.gov.in.

News December 6, 2025

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

image

బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.540 తగ్గి రూ.1,30,150కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.500 పతనమై రూ.1,19,300పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.100 తగ్గి రూ.1,95,900గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.