News November 12, 2024
శాంసన్‌పై ప్రశ్నకు మనసులు గెలిచేలా గౌతీ జవాబు
సంజూ శాంసన్ వరుస సెంచరీల వెనక తన ఘనతేమీ లేదని టీమ్ఇండియా కోచ్ గౌతమ్ గంభీర్ అన్నారు. అదంతా అతడి ప్రతిభేనని ప్రశంసించారు. ‘సంజూ ఫామ్ కోసం నేను చేసిందేమీ లేదు. అతడు సమర్థుడు. మనం చేయాల్సిందల్లా అతడిని సరైన స్థానంలో క్రీజులోకి పంపించి ఎంకరేజ్ చేయడమే. సంజూ చాలా శ్రమిస్తారు. ఇది అంతం కాదు ఆరంభం. భారత్ కోసం అతడిలాగే ఆడాలని కోరుకుంటున్నా. ప్రెజర్లోనూ యువ ఆటగాళ్లు రాణించడం శుభసూచకం’ అని పేర్కొన్నారు.
Similar News
News December 6, 2024
ప్రత్యర్థి పార్టీ నేత కుమార్తెతో కొడుకు పెళ్లి.. సీనియర్ లీడర్ సస్పెండ్
కొడుకు పెళ్లి పార్టీ క్రమశిక్షణారాహిత్యం కిందికి వస్తుందని ఆ BSP నేత ఊహించి ఉండకపోవచ్చు. కానీ అదే జరిగింది. UPలోని రాంపూర్ జిల్లా BSP నేత సురేంద్ర సాగర్ తన కుమారుడి పెళ్లి SP MLA త్రిభువన్ దత్ కుమార్తెతో చేశారు. దీంతో ప్రత్యర్థి పార్టీ నేతతో సంబంధం కుదుర్చుకున్నందుకు సీనియర్ నేత అని కూడా చూడకుండా సురేంద్రతోపాటు పార్టీ జిల్లా అధ్యక్షుడిని కూడా చీఫ్ మాయావతి సస్పెండ్ చేశారు.
News December 6, 2024
రేపు నటి, నటుడి పెళ్లి
తెలుగు నటుడు సాయి కిరణ్ 46 ఏళ్ల వయసులో రెండో వివాహం చేసుకోబోతున్నారు. సీరియల్ నటి స్రవంతితో రేపు ఆయన పెళ్లి జరగనుంది. ‘నువ్వే కావాలి’ మూవీతో గుర్తింపు తెచ్చుకున్న సాయి కిరణ్ పలు సినిమాల్లో హీరోగా, సపోర్టింగ్ రోల్స్‌లో నటించారు. ప్రస్తుతం సీరియల్స్‌తో బిజీగా ఉన్నారు. సాయి కిరణ్ తొలి వివాహం 2010లో వైష్ణవి అనే మహిళతో జరిగింది. వారిద్దరూ పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. వారికి ఒక కూతురు ఉంది.
News December 6, 2024
జగన్ పాలన.. దళితులకు నరకయాతన: లోకేశ్
AP: గత టీడీపీ హయాం(2014-19)తో పోలిస్తే వైసీపీ పాలనలో దళితులపై దాడులు 10 రెట్లు పెరిగాయని మంత్రి లోకేశ్ ఆరోపించారు. ‘జగన్ జమానాలో దళితులపై దమనకాండకు ఇవిగో సాక్ష్యాలు. దళితులను చంపి డోర్ డెలివరీ చేశారు. జే బ్రాండ్స్‌పై పోరాడినందుకు హత్యలు చేశారు. ఇసుక అక్రమాలపై నోరెత్తినందుకు శిరోముండనం చేశారు. జగన్ పాపాల చిట్టా రాజ్యసభ సాక్షిగా దేశానికి తెలిసింది’ అంటూ ఆయన Xలో పోస్ట్ చేశారు.