News March 31, 2025
GDK: వైద్యానికి ₹18 లక్షలు.. అయిన ప్రాణం నిలువలేదు!

గోదావరిఖని మాతంగి కాలనీకి చెందిన నవీన్ కుమారుడు దేవాన్ష్ ఇటీవల ఫిట్స్ రావడంతో HYDరెయిన్‌బో హాస్పిటల్లో చేర్పించారు. చికిత్స పొందుతూ మరణించాడు. అప్పటికే దాదాపు ₹18 లక్షలు ఖర్చు అయ్యాయి. అయితే హస్పిటల్ యాజమాన్యం మరో ₹ 5 లక్షలు కడితేనే మృతదేహాన్ని అప్పగిస్తామని పేర్కొంది. దీంతో మృతుని తండ్రి MLAరాజ్ ఠాకూర్ దృష్టికి తీసుకొచ్చారు. ఆయన ఆసుపత్రి యాజమాన్యంతో మాట్లాడి డెడ్ బాడీ ఇప్పించారు.
Similar News
News April 5, 2025
MDCL: జిల్లాలో 17.3 లక్షల మందికి రేషన్ బియ్యం..!

మేడ్చల్ జిల్లాకు సంబంధించిన రేషన్ కార్డులకు సంబంధించిన మరో రిపోర్టును Way2News సేకరించింది. నేటి వరకు జిల్లాలో రేషన్ కార్డుల సంఖ్య 5,30,590కు చేరిందని, దీంతో 17,37,600 మందికి 6 కిలోల చొప్పున రేషన్ బియ్యం అందుతుందని ఇన్‌ఛార్జి DCSO సుగుణ బాయి తెలిపారు. కులగణన ప్రకారం 12,243 దరఖాస్తులు రాగా, తాజాగా 6,818 రేషన్ కార్డులు జారీ అయ్యాయి.
News April 5, 2025
HYD: శ్రీరామనవమి బందోబస్తుపై CP మీటింగ్

HYD కమిషనరేట్ పరిధిలో ఏప్రిల్ 6వ తేదీన శ్రీరామనవమి శోభాయాత్రపై హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. శ్రీరామనవమి శోభాయాత్ర ప్రాధాన్యతను వివరించి, కొత్తగా చేరిన అధికారులకు బందోబస్తు ఏర్పాట్ల గురించి వివరంగా వివరించారు. అధికారుల నుంచి అభిప్రాయాలు తీసుకుని వారి సందేహాలను నివృత్తి చేశారు.
News April 5, 2025
IPL: ఉత్కంఠపోరులో గెలుపెవరిదంటే..

ముంబైతో జరిగిన ఉత్కంఠ పోరులో LSG విజయం సాధించింది. 204 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై 5 వికెట్ల నష్టానికి 191 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ జట్టు బ్యాటర్లలో నమన్ ధీర్(24 బంతుల్లో 46), సూర్యకుమార్(43 బంతుల్లో 67) పోరాడినా ఫలితం లేకపోయింది. LSG బౌలర్లలో శార్దూల్, ఆకాశ్, ఆవేశ్, దిగ్వేశ్ తలో వికెట్ దక్కించుకున్నారు.