News April 5, 2025

IPL: ఉత్కంఠపోరులో గెలుపెవరిదంటే..

image

ముంబైతో జరిగిన ఉత్కంఠ పోరులో LSG విజయం సాధించింది. 204 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై 5 వికెట్ల నష్టానికి 191 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ జట్టు బ్యాటర్లలో నమన్ ధీర్(24 బంతుల్లో 46), సూర్యకుమార్(43 బంతుల్లో 67) పోరాడినా ఫలితం లేకపోయింది. LSG బౌలర్లలో శార్దూల్, ఆకాశ్, ఆవేశ్, దిగ్వేశ్ తలో వికెట్ దక్కించుకున్నారు.

Similar News

News April 20, 2025

TGRJC CET: ఇంకా 3 రోజులే ఛాన్స్

image

తెలంగాణలోని 35 రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో ఫస్టియర్ సీట్ల భర్తీకి నిర్వహించే TGRJC CET-2025కు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. మూడు రోజుల్లో (ఈనెల 23తో) అప్లికేషన్ గడువు ముగియనుంది. <>https://tgrjc.cgg.gov.in/TGRJCWEB/<<>> వెబ్‌సైట్‌లో రూ.200 చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. మే 10న ఉదయం 10 గంటల నుంచి మ.12.30 గంటల వరకు పరీక్ష జరగనుంది. ఇప్పటివరకు 60 వేల మంది దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

News April 20, 2025

SSMB29: రెండు నెలలపాటు భారీ యాక్షన్ సీక్వెన్స్?

image

మహేశ్‌బాబు-రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న SSMB29 మూవీ గురించి ఓ క్రేజీ న్యూస్ బయటికొచ్చింది. 3వేల మంది జూనియర్ ఆర్టిస్టులతో ఓ భారీ బోట్ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరించేందుకు డైరెక్టర్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం హైదరాబాద్‌లో పెద్ద సెట్‌ను సిద్ధం చేస్తున్నట్లు టాక్. 2 నెలల పాటు షూట్ జరుగుతుందని, మహేశ్, పృథ్వీరాజ్, ప్రియాంక పాల్గొంటారని సమాచారం.

News April 20, 2025

మగవాళ్లకూ ‘హీ’ టీమ్స్ ఉండాలి: పురుషులు

image

మహిళలకు ‘షిీ’ టీమ్స్‌లాగే పురుషులకు కూడా ‘హీ’ టీమ్స్ ఉండాలని భార్యాబాధితులు డిమాండ్ చేశారు. భార్యల చిత్రహింసల నుంచి తమను కాపాడాలంటూ దేశంలోని వివిధ రాష్ట్రాల భార్యాబాధితులు ఢిల్లీలోని ధర్నా చౌక్‌లో ధర్నా చేశారు. ఈ ధర్నాలో ఏపీ, తెలంగాణ నుంచి ఎక్కువమంది బాధితులు పాల్గొన్నారు. వీరంతా ‘సేవ్ ఇండియన్ ఫ్యామిలీ’ పేరుతో ఆందోళన చేపట్టారు. తెలుగు బిగ్‌బాస్ కంటెస్టెంట్ శేఖర్ బాషా కూడా ఇందులో పాల్గొనడం విశేషం.

error: Content is protected !!