News August 2, 2024

ఒలింపిక్స్‌లో జెండర్ వివాదం.. కారణం ఇదే!

image

మహిళా బాక్సర్లు ఇమానే <<13755882>>ఖలీఫ్<<>>(అల్జీరియా), లిన్‌యూ టింగ్(తైవాన్) గత ఏడాది జెండర్ టెస్టుల్లో ఫెయిలయ్యారు. వీరిద్దరూ XY క్రోమోజోములు కలిగి ఉన్నట్లు టెస్టుల్లో తేలింది. దీంతో వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ చివరి మ్యాచులకు ముందు వీరిపై అనర్హత వేటు పడింది. ఇప్పుడు వీరి టెస్టోస్టిరాన్ లెవెల్ ఒలింపిక్ కమిటీ రూల్స్‌కు లోబడి ఉండటం, పాస్‌పోర్టుల్లో జెండర్ ఫిమేల్ అని ఉండటం వంటి కారణాలతో పోటీకి అనుమతించారు.

Similar News

News December 12, 2024

ప్రతి 10 లక్షల జనాభాకు 21 మంది జడ్జిలు: కేంద్రం

image

దేశంలో ప్రతి 10 లక్షల జనాభాకు 21 మంది జడ్జిలు ఉన్నారని కేంద్రం తెలిపింది. దేశంలోని హైకోర్టులలో 368 ఖాళీలు ఉండగా గరిష్ఠంగా అలహాబాద్ హైకోర్టులో 79 ఉన్నాయని వెల్లడించింది. రాజ్యసభలో ఓ ప్రశ్నకు కేంద్ర సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ సమాధానమిచ్చారు. జిల్లాలు, సబార్డినేట్ కోర్టుల్లో 5,262 ఖాళీలు ఉన్నట్లు వెల్లడించారు.

News December 12, 2024

కిషన్ రెడ్డితో రేవంత్ రెడ్డి భేటీ

image

TG: ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులతో భేటీ అవుతున్నారు. కాసేపటి క్రితం కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డితో సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ఇవాళ రాత్రి కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, నితిన్ గడ్కరీని కూడా సీఎం కలవనున్నారు.

News December 12, 2024

రాజ్యాన్ని కాపాడే సైనిక చీమలు

image

ప్రతి రాజ్యానికి సైనికులున్నట్లే ప్రత్యర్థుల నుంచి పుట్టలను కాపాడేందుకు ప్రత్యేకమైన చీమలు ఉంటాయి. వీటిని తాబేలు చీమలు లేదా సైనిక చీమలు అని పిలుస్తుంటారు. వీటి ప్రత్యేకమైన తలలే వీటి ఆయుధాలు. రాజ్యంలోకి ఇతర కీటకాలు రాకుండా గూళ్ల ప్రవేశాన్ని మూసేసి వాటిని అడ్డుకుంటాయి. తలను గూడు వద్ద తలుపులా ఫిక్స్ చేస్తాయి. ఏవైనా చీమలు బయటకు వెళ్లాలంటే అవి పక్కకు జరుగుతాయి. ఇవి చొరబాటుదారులను లోపలికి రానివ్వవు.