News January 21, 2025

నిధులు మంజూరు చేయించండి.. కిషన్ రెడ్డికి భట్టి వినతి!

image

TG: రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టులకు కేంద్రం నుంచి ₹1.63 లక్షల కోట్లు ఇప్పించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు. కోణార్క్‌లో ‘గనులు, ఖనిజాల శాఖల మంత్రుల’ సమావేశం సందర్భంగా ఆయనను కలిశారు. ORR-RRR రోడ్లకు ₹45,000cr, మెట్రో విస్తరణకు ₹24,269cr, మూసీ పునరుజ్జీవ పనులకు, సీవరేజ్ మాస్టర్ ప్లాన్ తదితర ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేయించాలని వినతిపత్రం ఇచ్చారు.

Similar News

News February 14, 2025

రేపు కందుకూరులో సీఎం చంద్రబాబు పర్యటన

image

AP: ‘స్వచ్ఛ ఆంధ్ర- స్వచ్ఛ దివస్’లో భాగంగా CM చంద్రబాబు రేపు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఉ.11.45కు ఆయన కందుకూరు TRR కాలేజీలో హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన వెళ్లి 12.05కు దూబగుంట శివారులోని వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్‌ను ప్రారంభిస్తారు. అనంతరం స్థానికులతో కలిసి పారిశుద్ధ్య కార్యక్రమంలో పాల్గొంటారు. తర్వాత మార్కెట్ యార్డుకు చేరుకొని ప్రజలతో ముఖాముఖి నిర్వహిస్తారు.

News February 14, 2025

MLC ఎలక్షన్స్: బరిలో 90 మంది

image

TG: ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. 3 స్థానాలకు మొత్తం 90 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. కరీంనగర్-ఆదిలాబాద్-నిజామాబాద్-మెదక్ గ్రాడ్యుయేట్ స్థానానికి 56 మంది, టీచర్స్ స్థానానికి 15, వరంగల్-ఖమ్మం-నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి 19 మంది పోటీలో ఉన్నారు. ఈనెల 27న పోలింగ్ జరగనుంది.

News February 14, 2025

భారత్‌ది ఎప్పుడూ ‘శాంతి’ పక్షమే: మోదీ

image

రష్యా, ఉక్రెయిన్ యుద్ధం విషయంలో భారత్ తటస్థంగా ఉందని ప్రపంచం అనుకుంటోందని ప్రధాని మోదీ అన్నారు. కానీ భారత్ ఎప్పుడూ శాంతివైపే ఉంటుందని చెప్పారు. పుతిన్‌తో ట్రంప్ చర్చలు జరపడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. తనలాగే ట్రంప్‌కు కూడా దేశమే తొలి ప్రాధాన్యమని, ఇరుదేశాలు మరింత బలోపేతమై ఇంకా ఎత్తుకు ఎదగాలన్నదే తన ఆశ అని పేర్కొన్నారు.

error: Content is protected !!