News January 12, 2025

GET READY: సాయంత్రం 5:30 గంటలకు..!

image

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ‘కల్కి’ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈచిత్రం టీవీల్లో టెలికాస్ట్ అయ్యేందుకు సిద్ధమైంది. ఈరోజు సాయంత్రం 5.30 గంటలకు ‘కల్కి’ జీతెలుగులో ప్రసారం కానుంది. దాదాపు రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ సినిమా ఈనెల 3 నుంచి జపాన్‌లో స్క్రీనింగ్ అవుతోంది.

Similar News

News February 19, 2025

త్వరలో.. బ్యాంకు డిపాజిట్లపై ఇన్సూరెన్స్ పెంపు!

image

బ్యాంకు కస్టమర్లకు కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పబోతున్నట్టు తెలిసింది. ప్రస్తుతం డిపాజిట్లపై ఉన్న ఇన్సూరెన్స్ కవరేజీని రూ.5 లక్షల నుంచి రూ.8-12 లక్షలకు పెంచబోతోందని సమాచారం. ప్రభుత్వం దీనిపై ఆలోచిస్తోందని ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్రటరీ నాగరాజు చెప్పినట్టు మనీకంట్రోల్ తెలిపింది. ఈ నెలాఖరు నుంచే కొత్త రూల్స్ అమల్లోకి రావొచ్చని పేర్కొంది. ఫిక్స్‌డ్, సేవింగ్స్, కరెంట్, రికరింగ్ A/Cకు ఇవి వర్తిస్తాయంది.

News February 19, 2025

మాజీ సీఎం KCR ఆగ్రహం

image

TG: కొందరు నేతలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటంపై మాజీ సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నేతలు భ్రమల్లో నుంచి బయటకు రావాలన్నారు. అధికారం అనుభవించి పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు దూరంగా ఉండటమేంటని ప్రశ్నించారు. అటు BRS సిల్వర్ జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. ఏప్రిల్ 27న భారీ బహిరంగ సభ నిర్వహిద్దామని, పార్టీ కమిటీలను నియమించాలని నేతలను ఆదేశించారు.

News February 19, 2025

MUDA SCAM: సిద్దరామయ్యకు లోకాయుక్త క్లీన్‌చిట్

image

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు ఊరట దక్కింది. ‘ముడా’ ల్యాండ్ స్కామ్ కేసులో ఆయనకు లోకాయుక్త క్లీన్‌చిట్ ఇచ్చింది. భూముల వ్యవహారంలో అక్రమాలకు పాల్పడ్డారని సిద్దరామయ్య, ఆయన సతీమణి పార్వతి తదితరులపై ఆరోపణలు వచ్చాయి. వీటికి ఎలాంటి ఆధారాల్లేవని తాజాగా లోకాయుక్త పోలీసులు వెల్లడించారు.

error: Content is protected !!