News June 21, 2024
GET READY: సాయంత్రం 6 గంటలకు ‘కల్కి’ రిలీజ్ ట్రైలర్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కల్కి’ సినిమా నుంచి సాయంత్రం 6 గంటలకు సెకండ్ ట్రైలర్ విడుదలకానుంది. ఈక్రమంలో మరో మూడు గంటల్లో రిలీజ్ ట్రైలర్ రాబోతోందని మేకర్స్ ఓ స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇప్పటికే ఓ ట్రైలర్ విడుదలవగా సినిమాపై అంచనాలు పెంచేసింది. ఈనెల 27న ప్రపంచవ్యాప్తంగా ‘కల్కి’ థియేటర్లలో రిలీజ్ కానుంది.
Similar News
News September 11, 2024
‘దేవర’ నుంచి మరో ట్రైలర్?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ‘దేవర’ మూవీ నుంచి మరో ట్రైలర్ రానున్నట్లు తెలుస్తోంది. నిన్న విడుదల చేసిన ట్రైలర్‌పై ప్రేక్షకుల నుంచి మిక్స్‌డ్ టాక్ రావడంతో మరో ట్రైలర్ రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది. కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ నెల 27న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
News September 11, 2024
నేటి నుంచి ఇసుక ఆన్‌లైన్ బుకింగ్
AP: ఇవాళ్టి నుంచి ఇసుక ఆన్‌లైన్ బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. ఏపీ శాండ్ పోర్టల్‌లో ఇసుక బుకింగ్ చేసుకోవచ్చు. ఇసుక రవాణా ఛార్జీల విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. గత ప్రభుత్వం విధించిన దానికంటే 30 నుంచి 50 శాతం ఛార్జీలు పెంచాలని సర్కార్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రం మొత్తం ఒకే ధరలు ఉండేలా ప్రణాళికలు రచిస్తోంది. 4.5 టన్నుల ఇసుక ట్రాక్టర్‌కు తొలి 10 కి.మీకు రూ.547 వసూలు చేయనున్నట్లు సమాచారం.
News September 11, 2024
పాకిస్థాన్ కాల్పులు.. BSF జవానుకు గాయాలు
భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో కాల్పులు జరిగాయని BSF వెల్లడించింది. జమ్మూకశ్మీర్‌లోని అఖ్నూర్ ప్రాంతంలో అర్ధరాత్రి 2.35 గంటలకు సరిహద్దులో పాకిస్థాన్ కాల్పులకు తెగబడిందని తెలిపింది. దీనికి BSF జవాన్లు దీటుగా జవాబిచ్చారని, ఒక జవానుకు గాయాలు అయ్యాయని పేర్కొంది. సైనికులందరూ హై అలర్ట్‌గా ఉన్నారని వివరించింది.