News September 18, 2024

మెగాఫ్యాన్స్ రెడీ అయిపోండి: తమన్

image

రామ్‌చరణ్ ‘గేమ్‌ఛేంజర్’ అప్‌డేట్స్ సరిగ్గా లేకపోవడం పట్ల మెగాభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. వారందరికీ ఆ సినిమా సంగీత దర్శకుడు తమన్ గుడ్ న్యూస్ చెప్పారు. ‘గేమ్‌ఛేంజర్‌ ఈవెంట్లకు వచ్చేవారం నుంచి అడ్డూఆపూ ఉండదు. డిసెంబరు 20న విడుదలయ్యే వరకు వెల్లువలా అప్‌డేట్స్ వస్తాయి’ అని ట్వీట్ చేశారు. దీంతో త్వరగా అప్‌డేట్స్ ఇస్తే బ్రేక్ ఇస్తామంటూ చరణ్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

Similar News

News November 22, 2025

కర్నూలు: సీఐ జీపు ఎత్తుకెళ్లిన మందుబాబు!

image

కర్నూలు జిల్లా ఆలూరు మండలంలో వింత ఘటన జరిగింది. పెద్దహోతూరుకు చెందిన యువరాజు మద్యం మత్తులో సీఐ రవిశంకర్ జీపును ఎత్తుకెళ్లాడు. పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించగా యువరాజు డ్రంకన్ డ్రైవ్‌లో బైక్‌తో పట్టుబడ్డారు. తన బైక్ ఇవ్వనందుకు పోలీసులను మరిపించి సీఐ జీపును తన గ్రామానికి తీసుకెళ్లాడు. ఇది గమనించిన యువరాజు సోదరుడు అంజి వెంటనే జీపును తిరిగి పోలీస్ స్టేషన్‌కు చేర్చారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

News November 22, 2025

ఇతిహాసాలు క్విజ్ – 74

image

ఈరోజు ప్రశ్న: వేంకటేశ్వరస్వామి ద్వార పలుకులు అయిన జయవిజయులు తర్వాతి మూడు జన్మలలో అసురులుగా ఎందుకు జన్మించారు?
☛ పై ప్రశ్నకు జవాబును సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు జవాబు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. <<-se>>#Ithihasaluquiz<<>>

News November 22, 2025

26న ‘స్టూడెంట్ అసెంబ్లీ’.. వీక్షించనున్న సీఎం

image

AP: రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఈ నెల 26న అసెంబ్లీ ఆవరణలో ‘స్టూడెంట్ అసెంబ్లీ’ నిర్వహించనున్నారు. ఇందుకోసం 175 నియోజకవర్గాల నుంచి 175 మంది విద్యార్థులను విద్యాశాఖ ఎంపిక చేసింది. కొందరు స్పీకర్, Dy.స్పీకర్, CM, ప్రతిపక్షనేతగా వ్యవహరిస్తారు. మిగతా విద్యార్థులు తమ నియోజకవర్గ సమస్యలను సభ దృష్టికి తీసుకొస్తారు. రాష్ట్రాభివృద్ధికి సూచనలు చేస్తారు. ఈ కార్యక్రమాన్ని CM CBN, మంత్రులు వీక్షించనున్నారు.