News September 18, 2024
మెగాఫ్యాన్స్ రెడీ అయిపోండి: తమన్
రామ్‌చరణ్ ‘గేమ్‌ఛేంజర్’ అప్‌డేట్స్ సరిగ్గా లేకపోవడం పట్ల మెగాభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. వారందరికీ ఆ సినిమా సంగీత దర్శకుడు తమన్ గుడ్ న్యూస్ చెప్పారు. ‘గేమ్‌ఛేంజర్ ఈవెంట్లకు వచ్చేవారం నుంచి అడ్డూఆపూ ఉండదు. డిసెంబరు 20న విడుదలయ్యే వరకు వెల్లువలా అప్‌డేట్స్ వస్తాయి’ అని ట్వీట్ చేశారు. దీంతో త్వరగా అప్‌డేట్స్ ఇస్తే బ్రేక్ ఇస్తామంటూ చరణ్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
Similar News
News October 12, 2024
WOW: కుర్రాడిలా మారిపోయిన ధోనీ!
టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఎప్పటికప్పుడు కొత్త లుక్స్ ట్రై చేస్తుంటారు. ఈ ఏడాది ఐపీఎల్‌లో జులపాల జట్టుతో తన కెరీర్ ఆరంభంలో ఉన్నట్లుగా కనిపించారు. తాజాగా హెయిర్ కట్ చేయించి మరింత కుర్రాడిలా మారిపోయారు. సీఎస్కే టీమ్ ట్విటర్‌లో ఆ లుక్స్ పంచుకుని ‘ఎక్స్‌ట్రీమ్ కూల్’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. 43 ఏళ్ల ధోనీ ఆ పిక్స్‌లో నవ యువకుడిలా కనిపిస్తుండటం విశేషం.
News October 12, 2024
ICICI క్రెడిట్ కార్డులో మార్పులు.. NOV 15 నుంచి అమలు
☞ యుటిలిటీ, ఇన్సూరెన్స్ చెల్లింపులపై ప్రీమియం కార్డు హోల్డర్లకు ₹80వేలు, సాధారణ కార్డు హోల్డర్లకు ₹40వేల వరకే రివార్డులు అందుతాయి
☞ గ్రాసరీ, డిపార్ట్‌మెంట్ స్టోర్లలో ₹40వేల వరకే రివార్డులు
☞ పెట్రోల్ బంకుల్లో ₹50వేల లావాదేవీ వరకే సర్‌ఛార్జ్ రద్దు
☞ యాడ్ ఆన్ కార్డుపై ఏటా ₹199 ఫీజు
☞ క్రెడిట్ కార్డుతో స్కూళ్లు, కాలేజీల్లో చేసే చెల్లింపులపై ఫీజు ఉండదు
☞ థర్డ్ పార్టీ యాప్స్‌తో చేసే చెల్లింపుపై 1% ఫీజు
News October 12, 2024
బాలయ్య-బోయపాటి కాంబోలో ‘BB4’
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో మరో సినిమా తెరకెక్కనుంది. ఇప్పటికే ఈ కాంబోలో సింహా, లెజెండ్, అఖండ సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. ఇప్పుడు 14 రీల్స్ ప్లస్ సంస్థ నిర్మాణంలో 4వ సినిమా మొదలుకానుంది. విజయ దశమి సందర్భంగా సంస్థ ఈ రోజు ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 16న ‘BB4’ ముహూర్తం షాట్ చిత్రీకరించనున్నట్లు అందులో పేర్కొంది.