News December 6, 2024
అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీగా ఘంటా చక్రపాణి

TG: అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీగా ఘంటా చక్రపాణి నియమితులయ్యారు. ఈమేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఇటీవల TGPSC ఛైర్మన్‌గా బుర్రా వెంకటేశంను సర్కార్ నియమించిన విషయం తెలిసిందే.
Similar News
News March 7, 2026
మమతకు నాపై కోపం ఉండొచ్చు.. కానీ: ద్రౌపదీ ముర్ము

WB పర్యటనలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు చేదు అనుభవం ఎదురైంది. అంతర్జాతీయ ఆదివాసీ సదస్సు కోసం అక్కడికి వెళ్లిన రాష్ట్రపతికి CMతో పాటు అధికారులెవరూ స్వాగతం పలకలేదు. అటు సిలిగుడిలోని సభకు అనుమతి ఇవ్వకుండా వేదికను గోసైన్‌పూర్‌కు మార్చడంపై ముర్ము అసహనం వ్యక్తం చేశారు. ‘మమతకు నాపై కోపం ఉండొచ్చు. కానీ నాకు ద్వేషం లేదు. ఆమె నాకు సోదరి లాంటివారు. ఆదివాసీలు ఏకం కాకుండా కొందరు అడ్డుకుంటున్నారు’ అని అన్నారు.
News March 7, 2026
వేసవిలో దోసకాయలు తింటే?

దోసకాయల్లో 90 శాతం నీరు, పొటాషియం, మెగ్నీషియం, ఎలక్ట్రోలైట్స్, ఫైబర్, విటమిన్-C, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఎండలు ఎక్కువగా ఉండే వేసవి కాలంలో వీటిని తినడం వల్ల శరీరం ఎప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉంటుంది. రక్తపోటు, బరువు అదుపులో ఉంటుంది. జీర్ణక్రియ, చర్మ ఆరోగ్యం, మూత్రపిండాల పనితీరు మెరుగుపడుతుంది. కిడ్నీల్లో రాళ్లను నివారించవచ్చు. తక్షణ ఎనర్జీ లభిస్తుంది. హానికర టాక్సిన్స్ బయటికి వెళ్లిపోతాయి.
#ShareIt
News March 7, 2026
నెలకు ₹2,500.. ఫ్రీ బస్ జర్నీ: మహిళలకు TVK చీఫ్ వరాలు

తమిళనాడు ఎన్నికల దృష్ట్యా మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు TVK చీఫ్ విజయ్ కీలక హామీలు ప్రకటించారు. ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామన్నారు. లేడీస్ కోసం ప్రత్యేకంగా పోలీస్ విభాగం ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. పేదలకు ఏటా ఫ్రీగా 6 గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేస్తామని తెలిపారు. పాఠశాల చిన్నారులకు ఏడాదికి ₹15 వేల ఆర్థిక సాయం అందజేస్తామన్నారు. మహిళలకు నెలకు ₹2,500 ఇస్తామని హామీ ఇచ్చారు.


