News December 5, 2024
GHMC రోడ్ల నిర్మాణాల కోసం నిధులు

GHMCలో HCT ప్రాజెక్టులో భాగంగా చేపట్టే రోడ్ల పనుల కోసం రూ.5942 కోట్ల పాలనా అనుమతులు ఇస్తూ ప్రభుత్వం GO ఇచ్చింది. తక్షణమే టెండర్లు పిలిచి ఈ నిధులతో పనులు చేపట్టాలంది. GHMCలోని ఆరు జోన్లలో 5 ప్యాకేజీల్లో పనులు చేపట్టనుండగా, సికింద్రాబాద్ AOCలో రోడ్ల నిర్మాణం కోసం రూ.940 కోట్లు, శేరిలింగంపల్లి జోన్‌లో రూ.837 కోట్లు, LBనగర్ జోన్‌లో రూ.416 కోట్లు, ఖైరతాబాద్ జోన్‌లో రూ.398 కోట్లు రిలీజ్ చేసింది.
Similar News
News February 8, 2026
ఓపెన్ డిగ్రీతో సాఫ్ట్‌వేర్ జాబ్!

TG: డా.బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ విద్యార్థులకు బంపర్ ఆఫర్ తీసుకొచ్చింది. TCSతో కలిసి ‘జాబ్ అచీవర్ బిజినెస్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్’ అనే స్పెషల్ ప్రోగ్రాంను ప్రారంభించింది. దీంతో డిగ్రీ పట్టాతో పాటు ఉద్యోగ నియామకపత్రం అందేలా కోర్సును రూపొందించామని వీసీ ఘంట చక్రపాణి తెలిపారు. మార్చి 15లోగా అడ్మిషన్లకు అవకాశం ఉందన్నారు. మరిన్ని వివరాలకు <
News February 8, 2026
IAFలో అగ్నివీర్ వాయు పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

<
News February 8, 2026
కనకాంబరం సాగుకు అనువైన రకాలు

‘టిటియా ఎల్లో’ పసుపు రంగు పువ్వులు, ‘సెబకాలిస్ రెడ్’ ఎరుపు రంగు పువ్వులు, నారింజ రంగులో ‘లక్ష్మీ’ అధిక దిగుబడినిస్తాయి. ముదురు ఎరుపు రంగులో ఉండే ‘డా.ఎ.పి.జె. అబ్దుల్ కలాం’ రకం అధిక నిల్వ స్వభావం కలిగి ఎక్కువ దూరం రవాణాకు అనుకూలమైంది. IIHR అభివృద్ధి చేసిన రకాలు అర్కా అంబరా(నారింజ ఎరుపు), అర్కా చెన్నా(నారింజ), అన్న కనక(నారింజ), అర్కా శ్రావ్య(నారింజ ఎరుపు) రకాలు ఎక్కువ దిగుబడినిస్తాయి.


