News May 11, 2024

గిల్‌కు రూ.24 లక్షల ఫైన్

image

నిన్న CSKతో మ్యాచులో స్లో ఓవర్ రేట్ కారణంగా GT కెప్టెన్ గిల్‌కు BCCI రూ.24 లక్షల ఫైన్ వేసింది. అలాగే 10 మంది టీమ్ సభ్యులకు, ఇంపాక్ట్ ప్లేయర్లకు రూ.6 లక్షల చొప్పున జరిమానా విధించింది. ఈ సీజన్‌లో GT ప్లేయర్లకు జరిమానా వేయడం ఇది రెండోసారి. కాగా నిన్నటి మ్యాచులో గిల్, సాయిసుదర్శన్ సూపర్ సెంచరీలతో చెలరేగారు. దీంతో GT 35 రన్స్ తేడాతో గెలుపొందింది.

Similar News

News March 5, 2026

ప్రపంచంలో రద్దీగా ఉండే జలసంధులు ఇవే..

image

వివిధ ఖండాల మధ్య ఉన్న జలసంధుల ద్వారా చమురు రవాణా సాగుతుంటుంది. ఇందులో మలక్కా జలసంధి అతి ముఖ్యమైనది. ఇండోనేషియా దీవుల్లో ఉండే ఈ సంధి ద్వారా రోజుకు 23.2 మిలియన్ బ్యారెళ్ల క్రూడాయిల్ సరఫరా అవుతుంది. ఆ తర్వాత ఇరాన్ దగ్గరలోని హార్ముజ్ (20.9 M), సౌతాఫ్రికా కింద ఉన్న కేప్ ఆఫ్ గుడ్ హోప్ (9.1 M), ఈజిప్ట్ సూయిజ్ కెనాల్ (4.9 M), డానిష్ సంధి (4.9 M) ఉన్నాయి. తాజా యుద్ధంతో హార్ముజ్‌ను మూసివేశారు.

News March 5, 2026

హైదరాబాద్ CCMBలో ఉద్యోగాలు

image

HYDలోని<> CCMB<<>> 3 Sr. ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ సైంటిస్ట్, ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ పోస్టులను భర్తీ చేయనుంది . అర్హతగల వారు మార్చి 17న ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. పోస్టును బట్టి PG(నేచురల్ సైన్స్), BE/BTech, MBBS, ఫార్మసీ, PhD(బయోఇన్ఫర్మాటిక్స్/ జెనిటిక్స్/ లైఫ్ సైన్స్), డిగ్రీ(మైక్రో బయాలజీ, బయోటెక్నాలజీ, వైరాలజీ, మాలిక్యులార్ బయాలజీ) అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. సైట్: www.ccmb.res.in

News March 5, 2026

రాజ్యసభ అభ్యర్థి నితీశ్ కుమార్ నామినేషన్

image

బిహార్ సీఎం నితీశ్ కుమార్ రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. అంతకుముందు కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయాధ్యక్షుడు నితిన్ ఆయనతో భేటీ అయ్యారు. అనంతరం షా సమక్షంలో నితీశ్ నామినేషన్ ఫైల్ చేశారు. రాజ్యసభ ఎన్నికలు జరిగే మార్చి 16 వరకు ఆయన సీఎం పదవిలో ఉంటారని జేడీయూ వర్గాలు చెబుతున్నాయి.