News July 30, 2024

క్యాబినెట్‌లో మాదిగలకు ఛాన్స్ ఇవ్వండి: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

image

TG: మంత్రివర్గ విస్తరణలో తమ సామాజిక వర్గానికి ప్రాధాన్యం కల్పించాలని మాదిగ సామాజిక వర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్‌కు విజ్ఞప్తి చేశారు. అడ్లూరి లక్ష్మణ్, కవ్వంపల్లి సత్యనారాయణ, మందుల సామ్యేలు, లక్ష్మీకాంతరావు, వేముల వీరేశం వీరిలో ఉన్నారు. మాదిగ వర్గానికి చెందిన దామోదర రాజనర్సింహ ఇప్పటికే క్యాబినెట్‌లో ఉండగా, జనాభాపరంగా గణనీయంగా ఉన్న తమకు మరిన్ని పదవులివ్వాలని వారు కోరారు.

Similar News

News October 14, 2025

గ్రౌండ్‌లోకి గులాబీ బాస్!

image

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికను బీఆర్ఎస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది. కార్యకర్తల్లో మరింత ఊపు తీసుకొచ్చి, ఓటర్లను ఆకట్టుకునేందుకు పార్టీ చీఫ్ కేసీఆర్ రంగంలోకి దిగనున్నారు. నవంబర్ మొదటి వారంలో ప్రచారానికి రానున్నారు. ఎర్రవల్లిలో పార్టీ అభ్యర్థి సునీతకు Bఫారమ్ ఇచ్చిన సందర్భంగా కేసీఆర్ హామీ ఇచ్చినట్లు బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. సభలోనా? లేక రోడ్ షోలో పాల్గొంటారనేది తెలియాల్సి ఉంది.

News October 14, 2025

బాధించేవే మెదడులో భారంగా ఉండిపోతాయి..!

image

ప్రేమతో పలకరించిన మాటల కంటే, బాధించిన విమర్శలనే మనిషి మెదడు ఎక్కువగా గుర్తుంచుకుంటుంది. దీనికి ‘సర్వైవల్ క్యూ మెకానిజం’ కారణమని పరిశోధకులు చెబుతున్నారు. ప్రతికూల భావోద్వేగాలు మెదడులో బలమైన నాడీ ప్రతిస్పందనలను యాక్టివేట్ చేయడం వల్ల 2 దశాబ్దాలు దాటినా గుర్తుంచుకుంటామని తెలిపారు. ప్రశంసలు సురక్షిత సంకేతాలు కాబట్టి అవి నెల రోజుల్లోనే మసకబారిపోతాయని వెల్లడించారు. మీకూ ఇలానే జరిగిందా?

News October 14, 2025

పెట్టుబడుల్లో వెండే ‘బంగారం’

image

బంగారం, వెండి ధరలు రోజురోజుకు ఆకాశాన్నంటుతున్నాయి. చాలామంది వీటిని సేఫెస్ట్ ఆప్షన్‌గా భావిస్తూ భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. అయితే గోల్డ్ కంటే సిల్వర్‌ ఎక్కువ రిటర్న్స్ ఇస్తోందన్న విషయం తెలుసా? గత ఐదేళ్లలో బంగారంపై 33.15%, వెండిపై అత్యధికంగా 37.23% లాభాలు వచ్చాయి. అదే సమయంలో సెన్సెక్స్‌‌ కేవలం 2.64% రిటర్న్స్ ఇవ్వగలిగింది. లాంగ్‌టర్మ్‌లో సిల్వర్, గోల్డ్ బెటర్ అని ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు.