News July 30, 2024
క్యాబినెట్‌లో మాదిగలకు ఛాన్స్ ఇవ్వండి: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
TG: మంత్రివర్గ విస్తరణలో తమ సామాజిక వర్గానికి ప్రాధాన్యం కల్పించాలని మాదిగ సామాజిక వర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్‌కు విజ్ఞప్తి చేశారు. అడ్లూరి లక్ష్మణ్, కవ్వంపల్లి సత్యనారాయణ, మందుల సామ్యేలు, లక్ష్మీకాంతరావు, వేముల వీరేశం వీరిలో ఉన్నారు. మాదిగ వర్గానికి చెందిన దామోదర రాజనర్సింహ ఇప్పటికే క్యాబినెట్‌లో ఉండగా, జనాభాపరంగా గణనీయంగా ఉన్న తమకు మరిన్ని పదవులివ్వాలని వారు కోరారు.
Similar News
News October 8, 2024
జమ్మూకశ్మీర్‌లో ఈ ఎన్నికలు ప్రత్యేకం: మోదీ
JKలో ఆర్టికల్ 370, 35(A) రద్దు తరువాత మొదటిసారిగా జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ఎంతో ప్రత్యేకం అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. భారీగా నమోదైన ఓటింగ్ ప్రజాస్వామ్యంపై ప్రజల విశ్వాసాన్ని ప్రదర్శించిందన్నారు. పార్టీ పనితీరుపై హర్షం వ్యక్తం చేసిన మోదీ ఓటువేసిన వారికి ధన్యవాదాలు తెలిపారు. JK ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పని చేస్తామన్నారు. మెరుగైన ఫలితాలు సాధించిన NCని అభినందించారు.
News October 8, 2024
BIG BREAKING: బీజేపీ సంచలన విజయం
ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ హరియాణాలో బీజేపీ సంచలన విజయం సాధించింది. వరుసగా మూడోసారి అధికారాన్ని చేజిక్కించుకుని హ్యాట్రిక్ కొట్టింది. తొలుత కాంగ్రెస్ భారీ ఆధిక్యంలో దూసుకెళ్లినా క్రమంగా కమలం రేసులోకి వచ్చింది. ఇక అప్పటినుంచి వరుసగా సీట్లు గెలుస్తూ మ్యాజిక్ ఫిగర్ (46) దాటింది. EC లెక్కల ప్రకారం 90 సీట్లకు గాను BJP 46, కాంగ్రెస్ 35 చోట్ల గెలిచాయి. చెరో 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.
News October 8, 2024
బీజేపీని గెలిపించిన 200 రోజుల ముఖ్యమంత్రి
ఎన్నికలకు 200 రోజుల ముందు హరియాణా CMగా బాధ్యతలు చేపట్టిన నాయబ్ సింగ్ సైనీ BJPని అనూహ్యంగా విజయతీరాలకు చేర్చారు. డమ్మీ CM అని ఎన్ని విమర్శలు వచ్చినా BJP ఎన్నికల ప్రచారం మొత్తం ఆయన చుట్టూనే తిరిగింది. ఫలితాలపై ముందుగానే బాధ్యత వహించిన సైనీ ప్రభుత్వ వ్యతిరేకతలోనూ పార్టీని ముందుండి నడిపారు. అంచనాలను తలకిందులు చేస్తూ బీజేపీ హ్యాట్రిక్ విజయానికి కారణమయ్యారు.