News November 20, 2024
‘కీ’లో తప్పులపై ఆధారాలు ఇవ్వండి: హైకోర్టు
AP: పోలీస్ కానిస్టేబుల్ ప్రాథమిక పరీక్ష తుది కీలో తప్పులపై ఆధారాలు ఇవ్వాలని అభ్యర్థులను హైకోర్టు ఆదేశించింది. కీలో 7 ప్రశ్నలకు తప్పుడు జవాబులున్నాయని, వాటిని పున:పరిశీలించి మళ్లీ కీ విడుదల చేయాలన్న అభ్యర్థుల పిటిషన్పై న్యాయస్థానం మరోసారి విచారించింది. తప్పులను నిర్ధారించే ఆధారాలు, పుస్తకాలను తమ ముందు ఉంచాలని ఆదేశించింది.
Similar News
News November 20, 2024
గ్యాంగ్ రేప్.. వెలుగులోకి కీలక విషయాలు
AP: విశాఖలో విద్యార్థినిపై <<14652198>>అత్యాచారం <<>>కేసులో కీలక విషయాలు బయటకొస్తున్నాయి. ప్రేమ, పెళ్లి పేరుతో యువతికి దగ్గరైన ప్రియుడే ఆమెను వంచించాడు. వీరు ఏకాంతంగా గడిపిన వీడియోను చూపించి అతడి స్నేహితులు సైతం లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆ తర్వాతా తమ కోరిక తీర్చాలని వారు వేధించడం, ప్రియుడు సైతం ఫ్రెండ్స్ కోరిక తీర్చాలని ఒత్తిడి చేయడంతో ఆమె ఆత్మహత్య చేసుకోబోయింది. తండ్రి కాపాడి ప్రశ్నించడంతో విషయం బయటకొచ్చింది.
News November 20, 2024
మహిళా సంఘాలకు రూ.లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు: భట్టి
TG: మహిళా సంఘాలకు ఐదేళ్లలో రూ.లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఏడాదిలో రూ.25వేల కోట్ల రుణాలు ఇవ్వనున్నట్లు నిన్న వరంగల్ సభలో వెల్లడించారు. ఈ రుణాలతో మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదగాలనే సంకల్పంతో తమ ప్రభుత్వం ముందుకు వెళ్తోందని అన్నారు.
News November 20, 2024
APలో మందుబాబులకు మరో శుభవార్త
AP: జాతీయ స్థాయిలో పేరొందిన కంపెనీలతో కూడా రూ.99కే మద్యం అమ్మించాలని ప్రయత్నిస్తున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. ‘రూ.99 మద్యానికి మంచి ఆదరణ వస్తోంది. ఇప్పటివరకు 5లక్షల కేసులకు పైగా విక్రయాలు జరిగాయి. పేరొందిన సంస్థలు సైతం ఈ మద్యం అమ్మకాలు ఎలా ఉన్నాయో చూస్తున్నాయి. అవి కూడా ఉత్పత్తి సామర్థ్యం పెంచుకుని, ఆ తర్వాత నాణ్యమైన మద్యం సరఫరా చేస్తాయి’ అని మంత్రి చెప్పారు.