News November 20, 2024

‘కీ’లో తప్పులపై ఆధారాలు ఇవ్వండి: హైకోర్టు

image

AP: పోలీస్ కానిస్టేబుల్ ప్రాథమిక పరీక్ష తుది కీలో తప్పులపై ఆధారాలు ఇవ్వాలని అభ్యర్థులను హైకోర్టు ఆదేశించింది. కీలో 7 ప్రశ్నలకు తప్పుడు జవాబులున్నాయని, వాటిని పున:పరిశీలించి మళ్లీ కీ విడుదల చేయాలన్న అభ్యర్థుల పిటిషన్‌పై న్యాయస్థానం మరోసారి విచారించింది. తప్పులను నిర్ధారించే ఆధారాలు, పుస్తకాలను తమ ముందు ఉంచాలని ఆదేశించింది.

Similar News

News April 18, 2026

యురేనియం ఇచ్చే ప్రసక్తే లేదు: ఇరాన్

image

శుద్ధి చేసిన యురేనియం నిల్వలను ఎక్కడికీ తరలించబోమని ఇరాన్ స్పష్టం చేసింది. అవి ఎప్పటికీ తమ నియంత్రణలోనే ఉంటాయని విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ తెలిపారు. యురేనియంను ఇచ్చేందుకు ఇరాన్ ఒప్పుకుందని అమెరికా అధ్యక్షుడు <<19670282>>ట్రంప్<<>> చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో క్లారిటీ ఇచ్చారు. రెండు దేశాల మధ్య చర్చల్లో ఈ అంశం ఎన్నడూ ప్రస్తావనకు రాలేదని పేర్కొన్నారు. యుద్ధాన్ని ముగించడంపైనే చర్చలు కేంద్రీకృతమయ్యాయని చెప్పారు.

News April 18, 2026

ఉమెన్స్ రిజర్వేషన్ బిల్లు.. ప్రతిపక్షాలపై పవన్ విమర్శలు

image

LSలో మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించి చట్టసభల్లో మహిళా శక్తిని పెంపొందించే అవకాశాన్ని ప్రతిపక్ష పార్టీలు దూరం చేశాయని AP Dy.CM పవన్ కళ్యాణ్ విమర్శించారు. ఈ బిల్లును LS ముందుకు తీసుకువచ్చిన ప్రక్రియను జనసేన స్వాగతించినట్టు చెప్పారు. అయితే ప్రతిపక్షాలు కూడా ఆమోదించి ఉంటే వారికీ గౌరవం దక్కేదన్నారు. రానున్న రోజుల్లోనైనా మహిళా శక్తికి చట్టసభల్లో సముచిత స్థానం దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

News April 18, 2026

సర్వీస్ ఇనామ్ భూములకు విముక్తి

image

AP: గ్రామీణ ప్రాంతాల్లో సర్వీసు ఇనామ్ భూములు కలిగిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఆ భూములకు నిషేధిత జాబితా నుంచి విముక్తి కల్పించింది. రాష్ట్రంలో 1,36,024 ఎకరాలను ఫ్రీ హోల్డ్ పరిధిలోకి తీసుకొస్తున్నామని, నిషేధ జాబితా 22(A) నుంచి తొలగించాలని రెవెన్యూ శాఖ ఆదేశాలిచ్చింది. దీంతో వీటి క్రయ, విక్రయాలకు, రిజిస్ట్రేషన్‌కు అనుమతి లభించనుంది. అవి పట్టా భూములుగా రికార్డుల్లో ఉంటాయి.