News August 20, 2024
3 వారాల్లో మధ్యంతర నివేదిక ఇవ్వండి: SC
దేశవ్యాప్తంగా ఆస్పత్రులు, వైద్య సంస్థల్లో వైద్యులు, సిబ్బంది రక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై మూడువారాల్లో మధ్యంతర నివేదిక ఇవ్వాలని నేషనల్ టాస్క్‌ఫోర్స్‌ను సుప్రీంకోర్టు కోరింది. పూర్తిస్థాయి నివేదికను 3 నెలల్లో అందజేయాలంది. క్యాబినెట్ సెక్రటరీ, కేంద్ర హోం, ఆరోగ్య శాఖ కార్యదర్శులు టాస్క్‌ఫోర్స్‌కు అవసరమైన సహకారాన్ని అందించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
Similar News
News September 10, 2024
హనీ ట్రాప్ జరిగింది.. నాపై కేసు కొట్టేయండి: ఎమ్మెల్యే పిటిషన్
AP: తనపై నమోదైన లైంగిక వేధింపుల కేసు <<14034033>>కొట్టేయాలని<<>> సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జులై, ఆగస్టులో ఘటన జరిగితే ఇంత ఆలస్యంగా మహిళ ఎందుకు ఫిర్యాదు చేశారని ప్రశ్నించారు. దీన్ని హనీట్రాప్‌గా పేర్కొన్నారు. తనను బెదిరించి అత్యాచారం చేశారని టీడీపీకి చెందిన ఓ మహిళ <<14026695>>వీడియోలు<<>> రిలీజ్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
News September 10, 2024
ఆ ఉద్యోగాల భర్తీపై ప్రచారం ఫేక్.. నమ్మొద్దు: సమగ్రశిక్ష
AP: డిగ్రీ అర్హతతో పలు ప్రభుత్వ ఉద్యోగాలను పాఠశాల విద్యాశాఖ భర్తీ చేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని సమగ్ర శిక్ష అధికారులు ఖండించారు. ‘సెంట్రల్, స్టేట్ స్కూల్స్, గురుకులాలు, ఇంటర్ బోర్డులో ఉద్యోగాలు అంటూ వార్తలు వస్తున్నాయి. DIKSHA&UNICEF కౌన్సెలింగ్ సెంటర్‌లోనూ పోస్టుల భర్తీ అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇలాంటి వార్తలను నమ్మొద్దు. దళారులకు డబ్బులు ఇచ్చి మోసపోవద్దు’ అని తెలిపారు.
News September 10, 2024
DANGER: దగ్గుకు ఈ మందు వాడొద్దు!
TG: లైసెన్స్ లేకుండా దగ్గు మందు (కాఫ్ సిరప్) తయారు చేస్తున్న కంపెనీపై అధికారులు రైడ్స్ చేశారు. HYD కూకట్‌పల్లిలో అఖిల్ లైఫ్ సైన్సెస్ అనే కంపెనీ ‘Glycoril Cough Syrup’ అనే సిరప్‌ను తయారు చేస్తున్నట్లు గుర్తించారు. క్వాలిటీ స్టాండర్డ్స్ లేని ఈ సిరప్ ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని, వినియోగించవద్దని హెచ్చరించారు. ఇలాంటి మందులు ఉంటే 1800-599-6969కు కాల్ చేయాలని ప్రజలకు సూచించారు.
SHARE IT