News January 28, 2025
జ్యోతి సురేఖకు ఖేల్‌రత్న ఇవ్వండి: హైకోర్టు

AP: ప్రముఖ ఆర్చర్ జ్యోతి సురేఖకు ఖేల్‌రత్న ఇవ్వాలని హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అధిక పాయింట్లు ఉన్నా తనను ఖేల్‌రత్నకు ఎంపిక చేయలేదని 2023లో ఆమె దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపి న్యాయస్థానం తీర్పు ఇస్తూ ఇవాళ ఉత్తర్వుల కాపీ విడుదల చేసింది. ఎన్నో అవార్డులు పొందినా తనకు ఖేల్‌రత్న ఇవ్వకపోవడంపై ఆమె కోర్టును ఆశ్రయించారు.
Similar News
News February 12, 2025
శ్రీశైలం బ్రహ్మోత్సవాల్లో ఆర్జిత సేవలు రద్దు

AP: మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల 19 నుంచి మార్చి 1 వరకు శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. శివ దీక్షాపరులకు ఈ నెల 19 నుంచి 23 వరకు సర్వదర్శనం కల్పించనున్నట్లు వెల్లడించారు. వేడుకల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
News February 12, 2025
బర్డ్ ఫ్లూ భయం.. రూ.150కే కేజీ చికెన్

ఏపీలో బర్డ్ ఫ్లూతో లక్షలాది సంఖ్యలో కోళ్లు మృతి చెందుతున్నాయి. దీంతో తెలంగాణలోనూ బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ ప్రారంభమైంది. ప్రజలు చికెన్ తినేందుకు భయపడుతున్నారు. హైదరాబాద్ నగరంలో సాధారణంగా రోజుకు 6 లక్షల కేజీల చికెన్ అమ్ముడవుతుంది. కానీ ఇప్పుడు 50 శాతం అమ్మకాలు పడిపోయాయి. దీంతో కేజీ చికెన్ రేటు రూ.150కి పడిపోయింది. ఏపీలోని తూ.గో., ప.గో., కృష్ణా జిల్లాల్లో బర్డ్ ఫ్లూతో భారీగా కోళ్లు చనిపోతున్నాయి.
News February 12, 2025
Stock Markets: కుప్పకూలాయి..

స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాల్లో మొదలయ్యాయి. నిఫ్టీ 22,862 (-209), సెన్సెక్స్ 75,570 (-730) వద్ద ట్రేడవుతున్నాయి. డొనాల్డ్ ట్రంప్ టారిఫ్స్ ప్రభావంతో గ్లోబల్ సప్లయి చైన్ దెబ్బతింటుందన్న ఆందోళనతో ఇన్వెస్టర్లు షేర్లను తెగనమ్ముతున్నారు. ఇండియా విక్స్ 2.75% పెరిగి 15.28కి చేరుకుంది. IT షేర్లు రాణిస్తున్నాయి. మీడియా, రియాల్టి, బ్యాంకు, హెల్త్‌కేర్, కన్జూమర్ డ్యురబుల్స్, O&G షేర్లు విలవిల్లాడుతున్నాయి.